
Sai Dharam Tej’s Sambarala Yeti Gattu: మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ బిగినింగ్ లో దూకుడు చూపించాడు కానీ.. ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏ సినిమాపడితే ఆ సినిమా చేసేయాలి అనుకోవడం లేదు. పక్కా బ్లాక్ బస్టర్ అనే సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకనే కథల ఎంపికలో కేర్ తీసుకోవడం.. సరైన కథను ఎంచుకోవడం కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. అయితే.. సంబరాల ఏటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తే.. ఇద్దరి వలన ప్లాన్ మారిందని తెలిసింది. ఇంతకీ.. తేజ్ చేస్తోన్న రిస్క్ ఏంటి..? సంబరాల ఏటిగట్టు ప్లాన్ మారడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరు..?
తేజ్.. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ సినమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆతర్వాత బ్రో అంటూ మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేశాడు. ఈ సినిమా 2023లో రిలీజైంది. అంటే.. తేజ్ నుంచి సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది. ఇంత వరకు కొత్త సినిమా రిలీజ్ చేయలేదు. సంబరాల ఏటిగట్టు అనే సినిమాని కొత్త దర్శకులు రోహిత్ తో చేస్తున్నాడు. ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడితో భారీ సినిమా చేయడమే రిస్క్ అనుకుంటే.. ఈ సినిమాని 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించడం మరో రిస్క్ అని టాక్ వినిపిస్తోంది.
అయినప్పటికీ కథ పై ఉన్న నమ్మకంతో అంత భారీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆమధ్య రామ్ చరణ్ సంబరాల ఏటిగట్టు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. భారీ పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా పై ఈ గ్లింప్స్ మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్ గా లాక్ చేశారు. ఐశ్వర్య లక్ష్మి ఉంది అంటే కథానాయిక పాత్రకు కూడా చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ భారీ చిత్రాన్ని ఈ ఇయర్ లో దసరాకి సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. Sai Dharam Tej’s Sambarala Yeti Gattu.
అయితే.. సెప్టెంబర్ 25న బాలయ్య అఖండ 2 విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అన్ని భాషల్లో ఫస్ట్ కాపీని సెప్టెంబర్ 25కి రెడీ చేయడం కుదరదని.. పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం జరిగింది కానీ.. మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమాతో పాటు సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా వస్తుంది. మావయ్య సినిమా వస్తుందంటే.. తేజ తన సినిమాని రిలీజ్ చేయాలి అనుకోడు. ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తాడు. అందుచేత బాలయ్య, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి సినిమాల కారణంగా తేజ్ సంబరాల ఏటిగట్టు పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది త్వరలోనే అప్ డేట్ ఇస్తారని సమాచారం.