చిరు, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. విశ్వంభర మూవీ సెట్స్ పై ఉండగానే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమాని స్టార్ట్ చేశారు. అయితే.. విశ్వంభర ఎప్పుడో విడుదల కావాలి కానీ.. ఇంత వరకు క్లారిటీ లేదు. ఇంకా మూవీ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓ సాంగ్ అలాగే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలి. దీని గురించి ఎలాంటి అప్ డేట్ లేదు కానీ.. అనిల్ రావిపూడి మూవీ గురించి మాత్రం అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఇంతకీ.. విశ్వంభర వచ్చేది ఎప్పుడు…? అనిల్ రావిపూడితో మూవీ అప్ డేట్ ఏంటి..?

విశ్వంభర మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు.. గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను సీరియస్ గా తీసుకున్న మెగాస్టార్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్పారట. స్వయంగా చిరునే అలా చెప్పడంతో మేకర్స్ మరింత కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ను మళ్లీ చేయించడం వలన రిలీజ్ పోస్ట్ పోన్ చేయాల్సివచ్చింది. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారనకున్నారు కానీ.. ఇంత వరకు విడుదల ఎప్పుడు అనేది ప్రకటించలేదు. జులై లేదా ఆగష్టులో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది కానీ.. ఇదే నిజమైతే ఈపాటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచేవారు. అలా చేయకపోవడంతో అనిల్ రావిపూడితో సినిమా తర్వాతే విశ్వంభర వస్తుందేమో అనే టాక్ వినిపిస్తోంది.

ఇక అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా సైలెంట్ గా సెట్స్ పైకి రావడం.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడం కూడా జరిగిందని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ తో రెడీగా ఉండడం.. చిరు డేట్స్ ఇవ్వడంతో.. చకచకా షూటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో మెగాస్టార్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. ఇక త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేయాలనేది టార్గెట్. అందుకనే అంత స్పీడుగా వర్క్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడితో సినిమా అంటే.. ప్రమోషన్స్ ను కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తుంటాడు. ఈ సినిమా టీమ్ ను పరిచయం చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం వైరల్ అయ్యింది. ఆతర్వాత ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో సైతం స్పెషల్ వీడియో రిలీజ్ చేసి అనిల్ రావిపూడి మామూలోడు కాదు అనిపించాడు. ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు కానీ.. సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం అయితే జరుగుతోంది. అనిల్ రావిపూడి, నయనతార కూడా వీడియోల్లో సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనడంతో ఈ టైటిలే ఖరారు చేయనున్నారనేది ఇన్ సైడ్ లీక్. భారీ అంచనాలతో నెక్ట్స్ సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి… చిరు, అనిల్ కలిసి ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.