
Director Shouryuv with Nani Again: ఇండస్ట్రీలో డైరెక్టర్స్.. ఒక హీరోని ఊహించుకుని కథ రాస్తే.. మరో హీరోతో సినిమా సెట్ అవుతుంటుంది. ఇది ఇప్పుడు జరగడం కాదు.. ఎప్పటి నుంచో ఇలా జరుగుతూనే ఉంది. అయితే.. ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమా ప్లాన్ చేస్తే.. మరో హీరోతో సెట్ అయ్యింది అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? ఏ హీరోతో మూవీ ఫిక్స్ అయ్యింది..? ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమా సెట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి..?
ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు చేయాలని ప్రయత్నించిన డైరెక్టర్ శౌర్యువ్. నేచురల్ స్టార్ నానితో శౌర్యువ్ హాయ్ నాన్న అనే సినిమాను రూపొందించారు. ఫీల్ గుడ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. అయితే.. ఈ సినిమా తర్వాత నాని నుంచి సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ సాధించాడు. హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ నుంచి మాత్రం కొత్త సినిమా రాలేదు. ప్రయత్నం చేయలేదా..? ఎందుకు ఇంత వరకు శౌర్యువ్ నుంచి సినిమా రాలేదు అంటే.. ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. హాయ్ నాన్న తర్వాత శౌర్యువ్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాడట. స్టోరీ రెడీ చేయడం.. కథ చెప్పడం కూడా జరిగిందట. అయితే.. ఎన్టీఆర్ బిజీగా ఉండడం వలనో లేక ఆ కథ ఆయనకు సెట్ కాదు అనుకున్నాడో కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆతర్వాత శౌర్యువ్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ ఫిల్మ్ నగర్ లో ప్రచారం ఊపందుకుంది. ఇక్కడ కూడా అంతే.. చరణ్ కూడా శౌర్యువ్ చెప్పిన స్టోరీ విన్నాడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ లీక్. అయితే.. చరణ్ ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ లతో సినిమాలు చేయాలి. Director Shouryuv with Nani Again.
చరణ్ ఒప్పుకున్న రెండు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో క్లారిటీ లేదు. అందుకనేమో శౌర్యువ్ కథకు నో చెప్పాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు చేయాలి అనుకుంటే.. కుదరలేదు. అందుకనే.. తనకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన నేచురల్ స్టార్ నానితోనే సెకండ్ మూవీ కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే.. ఈసారి రూటు మార్చి మాస్ స్టోరీ రెడీ చేశాడని తెలిసింది. పాన్ ఇండియా డైరెక్టర్స్ అండ్ అప్ కమింగ్ డైరెక్టర్స్ కథలు రెడీగా ఉన్నప్పటికీ.. హీరోలు బిజీగా ఉండడం వలన ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి. మరి.. శౌర్యువ్ నెక్ట్స్ మూవీ ప్రచారంలో ఉన్నట్టుగా నానితోనే ఉంటుందో మరో హీరోతో ఉంటుందో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/venky-ties-up-with-megastar-and-anil-ravapudi-movie-for-a-guest-role/