మా బ్యానర్ గౌరవం తగ్గే సినిమా నేను చేయను: ‘సోలో బాయ్’ నిర్మాత

Solo Boy Movie సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో గౌతమ్ కృష్ణ హీరోగా.. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సోలో బాయ్’. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, భద్రం, షఫీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థాంక్యూ మీట్ నిర్వహించింది టీమ్. ఈ కార్యక్రమంలో..

నటి అనిత చౌదరి మాట్లాడుతూ…‘‘సోలో బాయ్ సినిమా చూసిన వారంతా ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి నాతో వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నందుకుగాను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించారు. నిర్మాత సతీష్ గారికి మరింత లాభాలు వచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… ‘‘సోలో బాయ్ సినిమాకు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ ద్వారా సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా బ్యానర్ గౌరవం తగ్గే సినిమా నేను చేయను. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు మాత్రమే చేస్తాను. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.

నటుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ…‘‘సినిమా చూసిన ఒక పెద్దావిడ ఒక మంచి సినిమా చూసా అని చెప్పిన వీడియో చూసి చాలా సంతోషించాను. మంచి సినిమా చూశాననే ఫీల్‌తో ప్రేక్షకులు బయటకు వస్తుంటే అది తెలిసి నాకు ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది. ప్రేక్షకులు సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్లడం సంతోషకరంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కంటెంట్ హీరో’’ అని అన్నారు. Solo Boy Movie