
SSMB 29 Set a New Record: దర్శకధీరుడు రాజమౌళి.. ఒకప్పుడు తన ప్రతి సినిమా ఓ సంచలనం. ఇప్పుడు తన ప్రతి సినిమా ఓ చరిత్ర. బాహుబలి సినిమాతో బాలీవుడ్.. టాలీవుడ్ వైపు చూసేలా చేస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు జక్కన్న. ఇక నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం తన రూటు మార్చి ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయకుండా సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ సెట్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆ సెట్ ఏంటి..? సెట్ చేసిన రికార్డ్ ఏంటి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాకి పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ షెడ్యూల్స్ లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ సినిమాలో కీలకమైన వారణాసి సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేస్తున్నారట. ముందుగా వారణాసిలోనే తీయాలి అనుకున్నప్పటికీ.. అక్కడ అంత జనాల మధ్య షూట్ చేయడం అంత ఈజీ కాదనే ఉద్దేశ్యంతోనే సెట్ వేయాలని ఫిక్స్ అయ్యారట.
వారణాసి నగరాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఇందులో నదీ తీరాలు, ఘాట్ లు, పురాతన దేవాలయాలు.. ఇలా అన్నింటికి సంబంధించిన సెట్ వేస్తున్నారట. ఈ సెట్ కే 50 కోట్లు ఖర్చు అవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలోనే 50 కోట్లు ఖర్చు పెట్టి సెట్ ఎవరూ వేయలేదు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ సెట్స్ వేస్తుంటారు. దేవదాస్, బాజీరావ్ మస్తానీ, హీరామండి చిత్రాలకు 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టి సెట్స్ వేశారు. ఇప్పటి వరుకు సెట్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టారంటే.. ఇవే. ఇప్పుడు వీటికి మించి సెట్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. ఈ విధంగా ఎస్ఎస్ఎమ్.బి 29 సినిమా సెట్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. SSMB 29 Set a New Record.
ఈ టోటల్ మూవీ బడ్టెట్ విషయానికి వస్తే.. 1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.. అయితే.. అంతకు మించి బడ్జెట్ పెరిగినా పెరగచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది. ఈ విధంగా మహేష్, రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేయడంతోనే సెట్ బడ్జెట్ విషయంలోనూ, మూవీ బడ్జెట్ విషయంలోనూ రికార్డులు క్రియేట్ చేశారు. ఇక ప్రమోషన్స్ కంటెంట్స్, రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో.. అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని 2027లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.
Also Read: https://www.mega9tv.com/cinema/ntr-stopped-the-dragon-for-war-2-song-shooting/