
తమిళంలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘యుగి’. ఈ సినిమా ‘కార్తీక మిస్సింగ్ కేసు’ పేరుతో తాజాగా తెలుగులోకి వచ్చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ని భవాని మీడియా ద్వారా ఆహా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. జాక్ హారిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుతమైన స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కథిర్, నట్టి, ఆనందీ, నరైన్ తదితరులు నటించిన ఈ సినిమా తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. ఒక డిటెక్టివ్ తన బృందంతో కలిసి అదృశ్యమైన యువతిని వెతుకుతుంటాడు. ఈ దర్యాప్తులో కార్తిక అనే అమ్మాయి గురించి బయటపడే షాకింగ్ నిజాలు, ఊహించని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. అద్భుతమైన నటన, తీవ్రమైన థ్రిల్, భావోద్వేగాల మేళవింపు ఈ చిత్రాన్ని తప్పక చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్‌గా నిలబెట్టాయి.