
పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాలంటే.. ఎవరైనా బాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ కావాలంటారు. తమ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ తో కీ రోల్ కానీ.. గెస్ట్ రోల్స్ కానీ చేయిస్తారు. అయితే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించడం కోసం టాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ అవసరం అని బలంగా నమ్ముతున్నారు. నమ్మడమే కాదు.. ఆచరించి చూపిస్తున్నాడు. ఇంతకీ.. పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించడం కోసం రజినీ ఏం చేస్తున్నారు..?
రజినీకాంత్.. జైలర్ మూవీతో సక్సెస్ సాధించిన తర్వాత స్పీడు పెంచారు. అయితే.. రజినీ వేట్టైయన్ మూవీకి తెలుగు హీరో సపోర్ట్ కావాలని రానా దగ్గుబాటిని తీసుకున్నారు. ఆతర్వాత రజినీ కూలీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున సపోర్ట్ కావాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో క్యారెక్టర్ నచ్చడం.. పైగా రజినీకాంత్ మూవీ కావడంతో నాగ్ ఓకే చెప్పారు. ఇందులో నాగ్ విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే.. కాస్త పాజిటివ్.. కాస్త నెగిటివ్.. ఇలా నాగ్ రోల్ ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది.
వెట్టైయన్ కోసం రానా, కూలీ కోసం నాగ్ అయితే.. జైలర్ 2 కోసం బాలయ్యను రంగంలోకి దింపుతున్నాడట తలైవా. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తారని.. టాక్ వినిపిస్తోంది. రజినీ, బాలయ్య మధ్య సీన్స్ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని తెలిసింది. విశేషం ఏంటంటే.. ఇద్దరూ పోలీస్ క్యారెక్టర్స్ లోనే కనిపించబోతున్నారని టాక్ ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్.. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వర్క్ చేస్తున్నారట.ఈ విధంగా తలైవా టాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ తీసుకుంటుండడం విశేషం. మరి.. రజినీ ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.