వెండితెరపై మిస్టర్ IPL..!

Suresh Raina Mr. IPL: క్రికెటర్లు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలువురు ప్రముఖ క్రికెటర్లు వెండితెరపై కనిపించారు. హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు ఇప్పటికే తమిళ చిత్రాలలో నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాాజాగా ధోని క్లోజ్ ఫ్రెండ్ టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురైశ్ రైనా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు.

క్రికెట్‌కు, సినిమా పరిశ్రమకు మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలోకి టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్, “మిస్టర్ ఐపీఎల్”, “చిన్న తలా” వంటి ముద్దుపేర్లతో అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన సురేష్ రైనా చేరబోతున్నాడు. అతను ఓ తమిళ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేయనున్నారు. Suresh Raina Mr. IPL.

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల హృదయాల్లో చిన్న తలా, మిస్టర్ ఐపీఎల్ అనే పేర్లతో గుర్తింపు పొందిన సురేష్ రైనా ఇప్పుడు కొత్త అవతారంలో అభిమానులను పలకరించనున్నాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న నేపథ్యంలో, ఇప్పుడు అదే దారిలో సురేష్ రైనా కూడా అడుగుపెడుతున్నాడు. ఓ తమిళ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. రైనా నటించనున్న ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంతో రూపొందుతున్నట్లు తెలిసింది. అయితే, ఇందులో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారా? లేక అతిథి పాత్రతో మాత్రమే మెరవనున్నారా? అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ, తమిళ చిత్ర పరిశ్రమలో రైనా అడుగుపెట్టనున్నట్లు వచ్చిన వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేశాయి.

సురేష్ రైనా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎన్నో విజయాలు సాధించి, తనదైన ఆటతీరుతో దక్షిణాది ప్రజల్లో, ముఖ్యంగా తమిళనాడులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. చెన్నై అభిమానులు అతన్ని చిన్న తలాగా పిలుచుకుంటారు. ధోనీ తర్వాత అభిమానులకు అత్యంత నచ్చిన క్రికెటర్‌గా రైనా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే తమిళ సినీ ఇండస్ట్రీ ద్వారా తన పరిచయాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెటర్లు తమిళ చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సురేష్ రైనా కూడా అదే బాటలోకి రావడం విశేషం.

సురేష్ రైనా క్రికెట్‌లో తనదైన మార్క్ వేశారు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ఈ బ్యాట్స్‌మన్‌ ఆకాశాన్ని తాకే షాట్లు, మెరుపు ఫీల్డింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రైనా రికార్డులు సృష్టించాడు. 2022లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా, ఇప్పుడు తన దృష్టిని సినిమాలపై పెట్టాడు. తమ అభిమాన క్రికెటర్‌ను వెండితెరపై చూడబోతున్నామంటే ఆనందానికి అవధుల్లేవంటున్నారు చెన్నై అభిమానులు. రైనా నటనలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడని ఆశిస్తూ, త్వరలో అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైనా క్రికెట్‌లో ఎలాగైతే సక్సెస్ అయ్యారో.. సినిమాల్లో కూడా అలాగే భారీ విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సురేష్ రైనా తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. దూకుడు బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇప్పుడు సినిమా రంగంలో కూడా అదే విజయాలను అందుకుంటాడని ఆశిద్దాం. అతని నటనా ప్రస్థానం విజయవంతం కావాలని కోరుకుందాం.

Also Read: https://www.mega9tv.com/cinema/veeramallu-breaks-pushpa-2-record-veeramallu-achieves-48-million-views-in-24-hours/