
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేయబోతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో సెట్స్ పైకి రానుంది. అయితే.. బన్నీ చేస్తున్నట్టుగానే.. సూర్య కూడా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. బన్నీ ఏం చేయబోతున్నాడు.?
బన్నీ, అట్లీ.. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుంటే ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. అయితే.. ఈ సినిమా కథ ఏంటి..? బన్నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. రకరకాల వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇందులో బన్నీని అట్లీ సరికొత్తగా చూపించబోతున్నాడని.. ముఖ్యంగా రెండు పాత్రల్లో డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పాత్రల్లో ఒకటి పాజిటివ్ క్యారెక్టర్ అయితే.. రెండోది నెగిటివ్ క్యారెక్టర్ అని తెలిసింది. ఈ రెండు క్యారెక్టర్స్ నువ్వా..? నేనా..? అని పోటీపడేట్టుగా ఉంటాయని సమాచారం.
ఇప్పుడు సూర్యతో వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో కూడా ఇలాగే ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సూర్యను వెంకీ అట్లూరి రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించనున్నాడని.. బలమైన కథ, కథనం రెడీ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి హీరో క్యారెక్టర్ అయితే.. రెండోది విలన్ క్యారెక్టర్. సూర్య గతంలో 24 సినిమాలో హీరోగానూ, విలన్ గానూ నటించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడట. ఇది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. ఏది ఏమైనా.. హీరో, విలన్ ఒకరే అంటే కాస్త రిస్కే. మరి.. నిజంగా ఈ రిస్కీ ప్రయత్నం చేస్తే బన్నీ, సూర్యలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.