రాజాసాబ్.. మిల్కీబ్యూటీ సెంటిమెంట్ కలిసొచ్చేనా..?

Tamannaah Special song in Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాకి మారుతి డైరెక్టర్. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 5న రాజాసాబ్ ధియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పెండింగ్ ఉన్న షూట్ ను చక చకా కానిచ్చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ ఉందట. ఈ సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీతో చేయాలని అనుకున్నప్పటికీ.. మిల్కీబ్యూటీని ఫైనల్ చేసారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. నిజంగానే తమన్నాతో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ బ్యూటీ సెంటిమెంట్ రాజాసాబ్ కు కలిసొచ్చేనా..?

కొన్ని రోజుల క్రితం మిల్కీబ్యూటీ కెరీర్ క్లైమాక్స్ కు వచ్చిందనే వార్తలు వినిపించాయి. అలాగే తమన్నా కూడా ఎక్కువుగా ఓటీటీ ప్రాజెక్టుల పైనే కాన్ సన్ ట్రేషన్ చేసేది. దీంతో నిజంగానే ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదేమో అనుకున్నారు. అయితే.. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ స్పీడు పెంచారు తమన్నా. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. మేటర్ ఏంటంటే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. ఇది గాసిప్ ఏమో అనుకున్నారు కానీ. ఇది నిజంగా నిజమని తెలుస్తోంది.

గతంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సినిమాలు అన్నీ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు, రజినీకాంత్ జైలర్, శ్రద్దా కపూర్ స్త్రీ 2 సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్ లో దర్శనమిచ్చింది. ఇలా ఓ పది సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసింది. దీంతో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టరే అనేది సెంటిమెంట్ గా మారింది. అందుకనే ఈ సెంటిమెంట్ రాజాసాబ్ విషయంలో కూడా రిపీట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ప్రభాస్, తమన్నా పై స్పెషల్ సాంగ్ షూట్ చేస్తారని సమాచారం. Tamannaah Special song in Rajasaab.

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో మరింత క్రేజ్ పెరిగింది. ప్రభాస్ ను ఇంత వరకు చూడని కోణంలో చూపిస్తుండడం.. ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండడంతో కామన్ ఆడియన్స్ లో కూడా రాజాసాబ్ పై మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. మరి.. రాజాసాబ్ కు మిల్కీబ్యూటీ స్పెషల్ సాంగ్ సెంటిమెంట్ ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/veeramallu-is-an-incarnation-of-shiva-and-vishnu-makers-give-clarity-on-the-story-of-veeramallu/