స్టార్ హీరోల అదిరిపోయే అప్ డేట్స్..!

అభిమానులు తమ ఫేవరేట్ హీరో సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది..? సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది..? ఇలా అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా కొంత మంది స్టార్ హీరోలు తమ సినిమాల అదిరిపోయే అప్ డేట్స్ ఇచ్చారు. ఒకరు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తే.. మరొకరు కొత్త సినిమాకు పూజ చేశారు. ఇంకొకరు షూటింగ్ కంప్లీట్ అయిన మూవీకి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇంతకీ.. ఆ స్టార్ హీరోలు ఎవరో.. ఏ ఏ అప్ డేట్స్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముస్సోరిలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా తెలియచేశారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమా కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవల హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. రీసెంట్ గా ఓజీ మూవీ పూర్తి చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యారు. ఎప్పటి నుంచో హరీష్ శంకర్ ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.

గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా లేవు.. ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ సెట్ లో పవన్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియచేయడమే కాకుండా.. స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ వీడియోలో పవన్ తో పాటు కిసిక్ బ్యూటీ శ్రీలీల కూడా కనిపించారు. ఇప్పుడు పవన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో వైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కే మూవీ పూజా కార్యక్రమాలు ముంబాయిలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు బన్నీ, అట్లీతో పాటు మృణాల్ ఠాగూర్ కూడా హాజరయ్యారని తెలిసింది.

ముంబాయిలోనే ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. అక్కడ మూడు వారాల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు డైరెక్టర్ అట్లీ. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకునే కన్ ఫర్మ్ అయ్యారు. అయితే.. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ సూర్య.. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ సెట్ లో సూర్య అడుగుపెట్టారు. అలాగే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. వార్ 2 షూటింగ్ కు డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14న విడుదల కానుంది. అంతే కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇలా స్టార్ హీరోలు అప్ డేట్స్ ఇవ్వడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.