ఆ నలుగురు ఫామ్ లోకి వచ్చేనా..?

The 4 heroes who gave success: ఒకప్పుడు సక్సెస్ లు ఇచ్చిన హీరోల్లో కొంత మంది ఫ్లాపులతో కెరీర్ లో వెనబడ్డారు. సరైన సక్సెస్ సాధించడం కోసం ఇప్పుడు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విజయం కోసం తపిస్తున్న హీరోల్లో నలుగురు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ నలుగురు ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారు. ఆ సినిమాల పై ఆడియన్స్ లో క్రేజ్ ఉంది. ఇంతకీ.. ఆ నలుగురు ఎవరు..? వాళ్లు చేస్తోన్న క్రేజీ సినిమాలు ఏంటి..? మరి.. ఈసారైనా ఆ నలుగురు ట్రాక్ లోకి వచ్చేనా..?

సక్సెస్ కోసం తపిస్తున్న ఆ నలుగురులో ముందుగా చెప్పుకోవాల్సింది మంచు విష్ణు. ఒకప్పుడు కెరీర్ బాగానే ఉండేది కానీ.. ఇప్పుడు ఏమాత్రం బాలేదు. ఇంకా చెప్పాలంటే.. 10 కోట్లు కూడా మార్కెట్ లేని విష్ణు 100 కోట్లు బడ్జెట్ పెట్టి కన్నప్ప సినిమాను తీసాడు. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో కన్నప్ప తీసి పెద్ద రిస్కే చేశాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్.. ఇలా క్రేజీ స్టార్స్ తో కన్నప్ప సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో ప్రభాస్ దాదాపు 30 నిమిషాలు కనిపిస్తాడని చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. జూన్ 27న కన్నప్ప రిలీజ్ కానుంది. ఈ సినిమాతో విష్ణు మళ్లీ ఫామ్ లోకి రావాలి అనుకుంటున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ ఎంత ఫాస్ట్ గా కెరీర్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడో అంతే ఫాస్ట్ గా కెరీర్ లో వెనకబడ్డాడు. లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్స్ సాధించడంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. విజయ్ లేటెస్ట్ గా నటించిన మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. చేతినిండా సినిమాలు ఉన్నా సక్సెస్ లేకపోవడంతో విజయ్ తెగ బాధపడుతున్నాడు. కింగ్ డమ్ తో ఫామ్ లోకి రావాలి అనుకుంటుంటే ఇదేమో పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. కింగ్ డమ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

కెరీర్ బాగా వెనబడిన మరో హీరో నితిన్. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, రాబిన్ హుడ్.. ఇలా వరుస ప్లాపుల నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇప్పుడు తమ్ముడు అనే సినిమా చేశాడు. వేణు శ్రీరామ్ ఈ మూవీకి డైరెక్టర్. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల పడుతూ ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. రాబిన్ హుడ్ మూవీని 70 కోట్లతో తీస్తే.. కనీసం 7 కోట్లు కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో జులై 4న వస్తున్న తమ్ముడు సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

కెరీర్ లో వెనబడి సక్సెస్ కోసం తపిస్తోన్న మరో హీరో అఖిల్. ఏజెంట్ అనే డిజాస్టర్ తర్వాత మరో సినిమా చేయడానికి రెండేళ్లు పట్టింది. ఇంత వరకు కొత్త సినిమా రాలేదు. ఇప్పుడు లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు ఈ మూవీ డైరెక్టర్. నవంబర్ లో ఈ సినిమాను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇలా విష్ణు, విజయ్ దేవరకొండ, నితిన్, అఖిల్.. సక్సెస్ కోసం తపిస్తున్నారు. మరి.. ఈ నలుగురు సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. The 4 heroes who gave success have fallen behind flops in their careers.

Also Read: https://www.mega9tv.com/cinema/the-year-2025-can-be-unforgettable-year-for-akkineni-heroes-and-fans/