
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంతో చేయాలనుకున్న సినిమా సత్యాగ్రహి. ఈ మూవీకి డైరెక్టర్ కూడా పవర్ స్టారే. ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాత. ఈ క్రేజీ మూవీని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే.. ఈ సినిమా ఊహించని విధంగా ఆగిపోయింది. ఆతర్వాత సత్యగ్రహి గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదిలా ఉంటే.. సత్యగ్రహి నిర్మించాలనుకున్న ఏఎం రత్నం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు అనే పీరియాడిక్ మూవీని నిర్మించారు. జూన్ 12న వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా వీరమల్లు విశేషాలతో పాటు సత్యాగ్రహి సీక్రెట్స్ బయటపెట్టారు. ఇంతకీ.. రత్నం చెప్పిన సత్యాగ్రహి సీక్రెట్స్ ఏంటి..?
పవర్ స్టార్ డైరెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ జానీ. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు.. ఈ సినిమా కథకు సెట్ కాలేదు. దీంతో జానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో పవన్ మళ్లీ డైరెక్షన్ చేయలేదు. అయితే.. సత్యాగ్రహి సినిమాను తన డైరెక్షన్ లోనే తెరకెక్కించాలి అనుకున్నాడు పవర్ స్టార్ కానీ.. ఎందుకనో లాంచ్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ఇప్పుడు సత్యాగ్రహి సినిమా గురించి పవన్, ఏఎం రత్నం ఇద్దరూ చర్చించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రత్నం బయటపెట్టారు.
ఇంతకీ సత్యాగ్రహి గురించి రత్నం చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే.. సత్యాగ్రహి అంటే.. ఉప్పు సత్యాగ్రహం తరహా సినిమా అనుకుంటారేమో కానీ.. సత్యాగ్రహి అంటే.. ఇందులో పవన్ క్యారెక్టర్ పేరు సత్య అని.. అతని ఆగ్రహాం ఎలా ఉంటుందో చూపించే కథతో ఈ సినిమా చేయాలి అనుకున్నారని చెప్పారు. పవన్ డైరెక్షన్ లో రూపొందిన జానీ సినిమా ఆడకపోవడం వలనే సత్యాగ్రహి సినిమా చేయలేదేమో కానీ.. చేసుంటే మాత్రం వేరే లెవల్లో ఉండేదన్నారు రత్నం. పవన్ లేటెస్ట్ గా సత్యాగ్రహి గురించి చెప్పిన మాటలను ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు వీరమల్లు ప్రొడ్యూసర్.
ఇంతకీ ఏం చెప్పారంటే.. సత్యాగ్రహి సినిమా చేసుంటే.. అమీర్ ఖాన్ లా ఓ వైపు హీరో గా నటిస్తూ మరో వైపు డైరెక్టర్ గా సినిమాలు చేసుకుంటూ వుండేవాడిని. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అన్నారట. వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో సత్యాగ్రహి సీక్రెట్స్ బయటపెట్టారు రత్నం. ఇప్పుడు సత్యాగ్రహి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. సత్యాగ్రహి సినిమా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు పవన్ ఎందుకు ఆ సినిమాను పక్కనపెట్టేసారో అర్ధం కావడం లేదు అంటున్నారు సినీ జనాలు. మరి.. ఫ్యూచర్ లో సత్యాగ్రహి సినిమా చేస్తారేమో చూడాలి.