
మొత్తంగా 365 చిత్రాల్లో, దాదాపు 70 మంది కథానాయికలతో జోడీ కట్టి అరుదైన సినిమాలు చేసి, హిట్ పాటలతో అలరించి.. రికార్డు సృష్టించారు. ఆయన చేసిన హిట్ సినిమాలు, రికార్డులు, అవార్డులు వంటి ప్రత్యేకతలు ఇదిగో..
- పాడిపంటలు, అగ్నిపర్వతం, వజ్రాయుధం, సింహగర్జన, రక్తసంబంధం, ఇద్దరు దొంగలు, అడవి సింహాలు, కొడుకు దిద్దిన కాపురం, పాడిపంటలు, అన్నదమ్ముల సవాల్, ఏజెంట్ గోపి, మండిన గుండెలు, వియ్యాలవారి కయ్యాలు, హేమాహేమీలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు, ఈనాడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, అడవి సింహాలు, వంటి అనేక చిత్రాలు కృష్ణ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
- తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ హీరోగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు.
సినీ రికార్డులు..
తొలి కలర్ సినిమా- తేనె మనసులు,
తొలి తెలుగు జేమ్స్‌బాండ్ చిత్రం- గూఢచారి 116,
తొలి కౌబాయ్ చిత్రం- మోసగాళ్లకు మోసగాడు,
తొలి సినిమా స్కోప్- అల్లూరి సీతారామరాజు,
తొలి 70 ఎం.ఎం సినిమా- సింహాసనం,
తొలి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం- ఈనాడు,
తొలి డీటీఎస్ మూవీ- తెలుగువీర లేవరా,
కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు- కుమారరాజా, డాక్టర్-సినీ యాక్టర్, రక్త సంబంధం, పగబట్టిన సింహం,
తెలుగులో మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం: సింహాసనం(3కోట్ల 20లక్షలు)
కృష్ణ నటించిన స్పై జోనర్ సినిమాలు ఇవే..
గూడఛారి 116, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపీ, రహస్య గూడఛారి, గూడఛారి 117.
కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్ సినిమాలు చేశారు.
- సినిమాలు తీయాలనే ఆశతో 1970లో స్వీయనిర్మాణ సంస్థగా పద్మాలయా స్టూడియోస్ అనే సంస్థను స్థాపించారు కృష్ణ. ‘మోసగాళ్లకు మోసగాడు’(1971) చిత్రం పద్మాలయా సంస్థకు తొలి విజయాన్ని అందించింది. దీన్ని హిందీ, తమిళ్, ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేశారు.
అవార్డులు…
- 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు.
- 1997లో ఫిలింఫేర్ జీవనసాఫల్య పురస్కారం. *2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ దక్కగా, *2009లో పద్మ భూషణ్ వచ్చింది.
- మొదట్లో కృష్ణను నటశేఖర, డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలుచుకునేవాళ్ళు. అయితే ప్రముఖ సినీ పత్రిక శివరంజని ఓ సందర్భంలో తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది. ఆ ఓటింగ్‌లో కృష్ణకు తిరుగులేని మెజార్టీ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయనను టాలీవుడ్ ప్రేక్షకులు ‘సూపర్ స్టార్’ అంటూ పిలుస్తున్నారు.