
Nani Rejected Yellamma’s Story: బలగం చిన్న సినిమాగా వచ్చింది. పెద్ద విజయం సాధించింది. అన్నింటి కంటే ఎక్కువుగా నిర్మాత దిల్ రాజుకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత బలగం వేణు ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఇంత వరకు సెట్స్ పైకి రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథను నానికి చెబితే చాలా బాగుందన్నాడు అనే టాక్ వచ్చింది. ఆతర్వాత ఈ చిత్రాన్ని నానితో కాకుండా నితిన్ తో చేస్తున్నట్టుగా తెలియచేశారు దిల్ రాజు. కథ బాగుందన్న నాని ఈ సినిమాని ఎందుకు చేయడం లేదు..? కథ విని నాని ఏం చెప్పాడు..? అసలు ఇంత వరకు ఎల్లమ్మ స్టార్ట్ కాకపోవడానికి కారణం ఏంటి..?
బలగం వేణు ఎల్లమ్మ అనే ఐడియా వచ్చినప్పటి నుంచి ఈ కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నాడు. కథ పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత దిల్ రాజు నానికి చెప్పిస్తే.. చాలా బాగుందని చెప్పాడట. ఇంకేముంది నాని, బలగం వేణు, దిల్ రాజు.. ఈ ముగ్గురు కాంబోలో సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. ఇక అతి త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారనుకుంటే.. నాని ఈ సినిమా చేయడం లేదు అనే వార్త లీకైంది. ఇక అక్కడ నుంచి నానికి కథ నచ్చలేదా..? అందుకే ఈ సినిమా చేయడానికి నో చెప్పాడా..? ఇలా.. సినీ అభిమానుల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. Nani Rejected Yellamma’s Story.
ఇప్పుడు ఇదే విషయం గురించి దిల్ రాజుని అడిగితే అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. నాని ఎల్లమ్మ కథ విని బాగుంది. అయితే.. వేరే వాళ్లు చేస్తే బాగుంటుంది. తను చేయాలంటే.. సంవత్సరంన్నర ఆగాలి అని చెప్పాడట. అయితే.. డైరెక్టర్ వేణు అంత టైమ్ వెయిట్ చేయలేను అనడంతో నాని కాకుండా మరో హీరో కోసం చూడాల్సివచ్చిందని దిల్ రాజు చెప్పారు. ఈ కథ అనే కాదు.. తన సంస్థ నుంచి వచ్చే అన్ని కథలు నాని వింటుంటాడని.. శతమానం భవతి సినిమా కథ కూడా నాని విన్నాడని దిల్ రాజు తెలియచేశారు.
నాని నో చెప్పడంతో.. ఈ కథ విశ్వక్ సేన్ దగ్గరకు వెళ్లింది. అక్కడ కూడా కథ నచ్చింది కానీ.. డేట్స్ ప్రాబ్లమ్ వలన కుదరలేదు. ఇప్పుడు ఈ కథతో నితిన్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కంచనున్నారు. ఇందులో కథానాయికగా పిధా బ్యూటీ సాయిపల్లవిని అనుకున్నారు కానీ.. రామాయణం మూవీలో బిజీగా ఉండడం వలన ఈ మూవీలో నటించడం లేదు. దీంతో ఈ కథను కీర్తి సురేష్ కు చెబితే వెంటనే ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. ఎప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేస్తారంటే.. తమ్ముడు సినిమా రిలీజ్ తర్వాత మంచి ముహుర్తం చూసి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.