
హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. ఈ మూవీకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటైన తమ్ముడు అనే టైటిల్ పెట్టడం విశేషం. ఈ సినిమాకి పవర్ స్టార్ టైటిల్ పెట్టినప్పటి నుంచి ఆ సినిమాకి, ఈ సినిమాకి లింక్ ఉంటుందా..? అసలు ఎందుకు ఈ టైటిల్ పెట్టారు అనేది ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేసింది. ఎప్పుడో విడుదల కావాల్సిన తమ్ముడు సినిమా జులై 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ టైటల్ వెనకున్న సీక్రెట్ బయటపెట్టాడు. ఇంతకీ.. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఏం చెప్పాడు..?
తమ్ముడు మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇది ఒక అక్క, ఒక తమ్ముడుకు సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. టైటిల్ క్లాస్ గా ఉంది.. ట్రైలర్ మాత్రం మాస్ గా ఉందని చెప్పచ్చు. ఇప్పటి వరకు నితిన్ నటించిన చిత్రాలకు భిన్నంగా.. ఆడియన్స్ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉందనే టాక్ వచ్చింది. నితిన్ ఇప్పుడు వరుస పరాజయాలతో కెరీర్ లో వెనబడ్డాడు. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన టైమ్ లో నితిన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా విజయం డైరక్టర్ వేణు శ్రీరామ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కంటే.. నితిన్ కి చాలా అవసరం.
ఇక ఈ మూవీకి తమ్ముడు అనే టైటిల్ ఎందుకు పెట్టారని డైరెక్టర్ ని అడిగితే.. ఈ కథ రాసేటప్పుడే తమ్ముడు అనే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు. సినిమా టైటిల్ ఎప్పుడూ సింపుల్ గా ఉండాలని చూస్తానన్నారు. నితిన్, దిల్ రాజు.. అలాగే ఈ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకనే ఈ టైటిల్ పెట్టారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వేణు శ్రీరామే చెప్పారు. నితిన్ పవన్ కు ఎంతటి వీరాభిమాని అనేది అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏదోక రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ టైటిల్ తోనే నితిన్ సినిమా చేయడం విశేషం.
ఈ సినిమాలో అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు..? ఇచ్చిన మాట ప్రాణం కంటే విలువైనది అనే పాయింట్ ఆధారంగా ఈ సినిమా తీసారని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఎమోషన్ తో పాటు యాక్షన్ ఉండడం.. ఓ గ్రామంలో మిస్టరీ కూడా ఉండడంతో ఆడియన్స్ లో ఈ సినిమా పై మరింతగా క్యూరియాసిటీ పెరిగింది.
దిల్ రాజు తన సినిమాలను జనాల్లోకి వెళ్లేలా బాగా ప్రమోట్ చేస్తారు. పైగా ఎంతో ఆలోచించి జులై 4 అనే డేట్ ఫిక్స్ చేశారు. ట్రైలర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ చూస్తుంటే.. ఈసారి నితిన్ కు సక్సెస్ రావడం ఖాయం అనిపిస్తోంది. మరి.. జులై 4 న తమ్ముడు నితిన్ నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాలి.