బాలయ్య, పవన్ ల మధ్య పోటీ తప్పదా..?

నట సింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ అఖండ 2. వీరిద్దరి కాంబోలో సింహా, లెజెండ్, అఖండ.. చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న క్రేజీ మూవీ ఓజీ. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. గ్లింప్స్ తోనే ఈ మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. అయితే.. ఇప్పుడు బాలయ్య అఖండ 2, పవన్ ఓజీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నాయని.. వార్తలు వస్తున్నాయి. మరి.. నిజంగానే బాలయ్య, పవన్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నారా..?

అఖండ 2 చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా షూటింగ్ ప్రారంభించిన టైమ్ లోనే అనౌన్స్ చేశారు. అయితే.. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగడం లేదని.. సెప్టెంబర్ 25న అఖండ 2 రాదని.. అందుకనే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. బోయపాటి మాత్రం జెట్ స్పీడుతో షూటింగ్ చేస్తున్నారట. ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో పాటల మినహా షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఆతర్వాత సాంగ్స్ కంప్లీట్ చేసి అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 25నే అఖండ 2 చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఓజీ విషయానికి వస్తే.. వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసిన పవర్ స్టార్ ఇటీవల ఓజీ షెట్ లో జాయిన్ అయ్యారు. ఈ మూవీకి 30 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. ఈ క్రేజీ మూవీని సెప్టెంబర్ 26న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఈ విషయాన్ని నిర్మాత దాయన్య డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పి.. బాలయ్య అఖండ 2 వచ్చిన నెక్ట్స్ డే ఓజీ వస్తే ఎలా ఉంటుందని అడిగారని తెలిసింది. ముందుగా సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ.. దసరా హాలీడే సీజన్ కాబట్టి 26 అయితేనే బాగుందని సీరియస్ గా ఆలోచిస్తున్నారని టాక్. అయితే.. బాలయ్య, పవన్ మధ్య రాజకీయం గానూ, వ్యక్తిగతం గానూ మంచి అనుబంధం ఉంది. అందుచేత ఇద్దరు హీరోలు తమ సినిమాలు పోటీపడడానికి ఒప్పుకోకపోవచ్చు. మరి.. ఈ రెండు క్రేజీ సినిమాల రిలీజ్ విషయంలో ఏం జరగనుందో చూడాలి.