సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్!

కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ… ఆతర్వాత కల్ట్ సినిమాగా పేరు తెచ్చుకుంటాయి. రిలీజైనప్పుడు ఫ్లాపై ఆతర్వాత కల్ట్ మూవీగా నిలిచిన సినిమానే ఖలేజా. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో ఈ సినిమా రూపొందింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఏమాత్రం మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత టీవీల్లో ప్రసారం చేస్తే మాత్రం రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది. కల్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ కల్ట్ మూవీ మరో రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. ఇంతకీ.. ఖలేజా ఎందుకు ప్లాప్ అయ్యింది..? ఇప్పుడు క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి..?

ఖలేజా సినిమా భారీ అంచనాలతో వచ్చింది. అయితే.. ఈ సినిమాలో మహేష్ ను అందరూ దేవుడు దేవుడు అంటుంటారు. త్రివిక్రమ్ తన దృష్టిలో దేవుడు అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు కానీ.. ఆయన చెప్పే విధానం జనాలకు అర్థం కాలేదు. అందుకనే ఖలేజా సినిమా జనాలను నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే.. టీవీల్లో ప్రసారం చేసినప్పుడు ఇది ఫ్లాప్ సినిమా అన్నట్టుగా ఏమాత్రం అంచనాలు లేకుండా చూశారు. అప్పుడు ఇందులో ఉన్న కామెడీ, యాక్షన్, సాంగ్స్.. ముఖ్యంగా మహేష్ సెటైరికల్ కామెడీ జనాలకు బాగా నచ్చింది. అందుకనే కల్ట్ మూవీగా నిలిచిందని చెప్పచ్చు.

ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్దమైంది. 4 కే వెర్షెన్ లో ఈ మూవీని ఈ నెల 30న రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను థియేటర్స్ లో చూడడం మిస్సైన వాళ్లు అందరూ ఇప్పుడు రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు బుక్ మై షోలో ఏకంగా లక్ష టిక్కెట్లు సేల్ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిని బట్టి ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రీ రిలీజ్ అయిన మహేష్ బాబు పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు బాక్సాపీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించాయి. అయితే.. ఇప్పటి వరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ ను విడుదలకు ముందే దాటేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరి.. రీ రిలీజ్ తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుందో..? ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.