నాగ్ పట్టాలెక్కించనున్న క్రేజీ ప్రాజెక్టులు ఇవే!

Nagarjuna King100 Update: అక్కినేని నాగార్జున కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆగష్టు 14న కూలీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. కుబేర సినిమా రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నాగార్జున తను చేయనున్న క్రేజీ ప్రాజెక్టులు ఏంటి అనేది తెలియచేశాడు. దీంతో నాగ్ క్రేజీ లైనప్ పై ఇప్పటి నుంచే మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. ఇంతకీ.. నాగ్ క్రేజీ లైనప్ ఏంటి..?

నాగార్జున 100వ సినిమా గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మైల్ స్టోన్ మూవీకి రంగం సిద్దమౌతోంది. కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను జులై నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజుకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. Nagarjuna King100 Update.

ఈ సినిమా తర్వాత ప్రముఖ నిర్మాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. అలాగే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా నాగ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయి. దీనికి డైరెక్టర్స్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని నాగార్జున స్వయంగా మీడియాకి తెలియచేశారు. ఈ రెండు నిర్మాణ సంస్థలతోనే కాకుండా మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కూడా నాగార్జున ఓ మూవీ చేయబోతున్నారని తెలిసింది.

వీటితో పాటు బ్రహ్మాస్త్ర పార్ట్ 2 గురించి కూడా నాగ్ క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మాస్త్ర మూవీ బాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి లాంటి సినిమా. ఈ సినిమాని కరణ్‌ జోహార్ ప్రొడ్యూస్ చేస్తే.. దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో నాగ్ కనిపించింది తక్కువ సేపే అయినా.. ఆ పాత్ర పోషించిన నాగ్ కు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే.. నాగ్ క్యారెక్టర్ అదిరింది అంటూ అభినందించారు. అయితే.. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 ఉందని అనౌన్స్ చేసారు కానీ. ఎప్పుడు ఉంటుంది..? అందులో నాగ్ ఉంటారా..? లేదా..? అనేది చెప్పలేదు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో తన పాత్ర ఉంటుందని నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఇలా నాగ్ లైనప్ క్రేజీ సినిమాలతో సూపర్ అనేలా ఉంది. మరి.. ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/power-star-pawan-kalyans-ambitious-film-hari-hara-veeramallu-to-release-on-july-24th/