2025..ఇది అక్కినేని వారి సంవత్సరం!

2025 can be unforgettable year for Akkineni heroes: అక్కినేని హీరోలు ఈమధ్య కాలంలో కెరీర్ లో వెనకబడ్డారు. దీంతో అక్కినేని హీరోలు మళ్లీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తారా..? ఎప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తారా..? అని అభిమానులు గత కొన్ని రోజులుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2025 ఇయర్ అక్కినేని నామ సంవత్సరం అంటున్నారు అభిమానులు. ఇలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?

అక్కినేని నాగచైతన్య థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ చిత్రాలతో వరుసగా ఫ్లాప్ ఉండడంతో హిట్ కొట్టాలి.. ఫామ్ లోకి రావాలి అని అభిమానులు తపించారు. అనుకున్నట్టుగానే ఈ ఇయర్ లో వచ్చిన తండేల్ సినిమాతో చైతన్య బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. చందై మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. చైతన్యకు ఫస్ట్ 100 కోట్ల సినిమాగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాతో బన్నీ వాసు చెప్పి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం విశేషం. ఈ సినిమాతో అక్కినేని హీరోల సక్సెస్ మళ్లీ స్టార్ట్ అయ్యింది.

ఇప్పుడు కింగ్ నాగార్జున కుబేర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి నాగార్జున నటించిన ఈ సినిమాని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సెకండ్ డే నుంచి కలెక్షన్స్ లో మరింతగా పెరిగాయి. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్స్ అవుతుండడంతో ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. తమిళ్ కంటే తెలుగులో ఈ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి. దీనికి థియేటర్స్ లో రన్ ఎక్కువ రోజులు ఉంటుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. తండేల్ సినిమాతో ఇచ్చిన సక్సెస్ ను నాగ్ కంటిన్యూ చేశారు. 2025 can be unforgettable year for Akkineni heroes.

ఇప్పుడు అఖిల్ వంతు. అఖిల్ లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ గ్లింప్స్ మూవీ పై మరింతగా అంచనాలు పెంచేశాయి. అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కుబేరలో కీలక పాత్ర చేయడం.. కూలీలో విలన్ పాత్ర చేయడం.. ఈ ఇయర్ లోనే నాగ్ 100వ సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో అభిమానులు అక్కినేని నామ సంవత్సరం లేదా నాగ్ నామ సంవత్సరం అంటున్నారు. ఇదే విషయం గురించి నాగార్జునతో చెబితే మాత్రం.. ఇది తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం అంటూ నవ్వేసారు. ఏది ఏమైనా.. 2025 ఇయర్ మాత్రం అక్కినేని అభిమానులు మరచిపోలేని ఇయర్ అని చెప్పచ్చు.

Also Read: https://www.mega9tv.com/cinema/joseph-gave-clarity-about-shaktimaan-he-pick-ranveer-singh-instead-of-allu-arjun-for-this-project/