చిరు, నాగ్ మూవీకి ముహూర్తం ఎప్పుడంటే..?

Chiru And Nag Combo: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ.. కుదరడం లేదు. ఇప్పుడు నాగ్ హీరోగానే చేయాలి అనే రూల్ ఏమీ పెట్టుకోలేదు. మంచి క్యారెక్టర్ అయితే చేయడానికి రెడీ అంటున్నాడు. ఇక నాగ్ బాటలోనే.. నేను నడుస్తాను అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంటే.. చిరు కూడా క్యారెక్టర్స్ చేయడానికి రెడీనే. ఇలాంటి పరిస్థితుల్లో చిరు, నాగ్ కలిసి సినిమా చేయచ్చు. గతంలో వీరిద్దరూ ఒక సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు కానీ.. ఇద్దరూ కలుసుకున్న సీన్స్ లేవు. దీంతో ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడాలని మెగా అభిమానులు, అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకీ.. వీరద్దరూ ఏ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. కలిసి నటించే భారీ, క్రేజీ మూవీ ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించడానికి రెడీ అంటూ నాగార్జున ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రకటించాడు. అలాగే నాగార్జునతో కలిసి నటించడానికి రెడీ అంటూ మెగాస్టార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కానీ.. ఇంత వరకు ఈ క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్ కాలేదు. కారణం సరైన కథ కుదరకపోవడం వలనే. చిరంజీవి.. నాగార్జునతోనే కాదు.. బాలయ్యతో కూడా కలిసి నటించడానికి రెడీ అంటూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. బాలయ్య 50 ఇయర్స్ యాక్టింగ్ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ.. బాలయ్యతో కలిసి నటిస్తాను.. కథ రెడీ చేయమని బోయపాటికి ఆఫర్ ఇచ్చారు. బోయపాటి ఎప్పుడు ఈ కాంబో స్టోరీ రెడీ చేస్తాడనేది ఆసక్తిగా మారింది.

ఇక చిరు, నాగ్ కలిసి ఏ సినిమాలో గెస్ట్ రోల్ చేశారంటే.. స్లైల్ సినిమాలో. ఈ సినిమాకి రాఘవ లారెన్స్ డైరెక్టర్. ప్రభుదేవా, లారెన్స్ నటించిన ఈ సినిమాలో చిరు, నాగ్ ఇద్దరూ గెస్ట్ రోల్స్ చేయడం విశేషం. అయితే.. ఇద్దరు కలిసి కనిపించారు. ఇద్దరూ వేరే వేరే సందర్భాల్లో స్టైల్ మూవీలో కనిపిస్తారు. లారెన్స్ చిరు, నాగ్ ని గెస్ట్ రోల్ చేయమని అడగడం.. ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాత కావడం తదితర కారణాల వలన ఈ సినిమాలో నటించారు. చిరు, నాగ్ గెస్ట్ రోల్ చేయడంతో స్టైల్ మూవీ అప్పట్లో సంచలనంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

ఈ స్టార్ హీరోలు ఇద్దరూ కలిసి నటించే సినిమా ఎప్పుడు అంటే.. త్వరలో అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తోంది. చిరు వెంకీతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టర్. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. చిరు, వెంకీ కాంబోలో సినిమా చేస్తున్నట్టే.. చిరు, నాగ్ కాంబోలో Chiru And Nag Combo కూడా అనిల్ రావిపూడి సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే ఓ రైటర్ కూడా ఈ క్రేజీ కాంబో కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మెగా క్రేజీ కాంబో సెట్ అయితే కనుక బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

Also Read: https://www.mega9tv.com/cinema/vijay-thalapathys-jana-nayagan-balayya-movie-remake-controversy/