పట్టాలెక్కనున్న ఆర్య 3 సుక్కు అసలు ప్లాన్ ఇదే!

ఆర్య సినిమా ఓ సంచలనం. ఇంకా చెప్పాలంటే.. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన సినిమా ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన ఆర్య బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఆర్య అంత కాకపోయినా.. ఆర్య 2 కూడా మెప్పించింది. అయితే.. ఇప్పుడు ఆర్య 3 వార్తల్లో నిలిచింది. ఆర్య 3 టైటిల్ ను దిల్ రాజు రిజిష్టర్ చేయించారని తెలిసినప్పటి నుంచి బన్నీతో ఇప్పట్లో కుదరదు. మరి.. ఆర్య 3 ఎవరితో చేస్తారు..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ గురించి అసలు ప్లాన్ లీకైంది. ఇంతకీ.. ఏంటా ప్లాన్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. అందుచేత ఇప్పట్లో బన్నీ డేట్స్ దొరకవు. పైగా ఇప్పుడు లవ్ స్టోరీస్ చేసే మూడ్ లో లేడు. ఇప్పుడు రేంజ్, క్రేజ్ పెరగడంతో పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీసే చేయాలి అనుకుంటున్నాడు. అందుకనే.. దిల్ రాజు ఆర్య 3 మూవీని బన్నీతో కాకుండా.. ఆశిష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం.

ఆర్య 3 లో హీరోగా బన్నీ నటించడం లేదు సరే.. మరి డైరెక్షన్ అయినా సుకుమార్ చేస్తున్నాడా అంటే.. చేయడం లేదని తెలిసింది. ఇప్పుడు సుకుమార్ ఇండియాలో వన్ ఆఫ్‌ ది టాప్ డైరెక్టర్. పుష్ప 2 తో చరిత్ర సృష్టించడంతో సుకుమార్ కు మరింత క్రేజ్ పెరిగింది. నెక్ట్స్ పాన్ ఇండియా మూవీని సుకుమార్.. చరణ్‌ తో చేయబోతున్నాడు. దీనికి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అయితే.. ఆర్య 3 మూవీని సుకుమార్ డైరెక్ట్ చేయడం లేదు కానీ.. ఈ మూవీలో తను ఓ పార్ట్ కాబోతున్నాడనే విషయం తెలిసింది. దీంతో ఆర్య 3 పై మరింత క్రేజ్ పెరగడం ఖాయం.

ఇంతకీ సుకుమార్ ఆర్య 3 కి ఏం చేయనున్నారంటే.. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాస్తున్నారట. అలాగే ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారని తెలిసింది. ఆర్య, ఆర్య 2 చిత్రాలకు మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను అఫిషియల్ గా ప్రకటించనున్నారు. ఆశిష్ రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఏమాత్రం మెప్పించలేదు. ఆతర్వాత లవ్ మీ అంటూ మరో సినిమాతో వచ్చాడు. ఆ మూవీ కూడా అంతే ఆకట్టుకోలేదు. ఇప్పుడు దేత్తడి అనే సినిమా చేస్తున్నాడు. మరి.. సక్సెస్ కోసం తపిస్తున్న ఆశీష్ కు ఆర్య 3 అయినా ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.