బన్నీ, అట్లీ మూవీ కోసం ఆ రెండు క్రేజీ టైటిల్స్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ క్రేజీ కాంబోలో మూవీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులే కాదు.. సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇటీవల అట్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు అఫిషియల్ గా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఈ భారీ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే.. ఈ సినిమా టైటిల్ అంటూ రెండు క్రేజీ టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ.. ఆ రెండు టైటిల్స్ ఏంటి..? ఏ టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారు..?

ఈ క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యిందని తెలిసినప్పటి నుంచి బన్నీ పాత్ర ఎలా ఉంటుంది..? అసలు కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. కారణం ఏంటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. బన్నీతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ.. అట్లీతో సినిమా చేయడానికి బన్నీ ఓకే చెప్పాడం హాట్ టాపిక్ అయ్యింది. ఇది రెగ్యులర్ స్టోరీ కాదు.. అంతకు మించి అనేలా ఉండే కథను అట్లీ రెడీ చేశారని.. అందుకనే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇందులో బన్నీ రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించనున్నాడని.. దీనికి తోడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడనేది ఆసక్తిగా మారింది.

ఇక టైటిల్ విషయానికి వస్తే.. ఈ మూవీకి ఐకాన్ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే.. బన్నీతో వేణు శ్రీరామ్ ఐకాన్ అనే టైటిల్ తో సినిమా చేయలి అనుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నారు. ఈ మూవీని ప్రకటించినప్పటికీ.. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు ఐకాన్ టైటిల్ పరిశీలిస్తుండడం విశేషం. ఇక మరో టైటిల్ ఏంటంటే.. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. అందుచేత సూపర్ హీరో అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ఇదే కనుక నిజమైతే.. ఐకాన్, సూపర్ హీరో.. ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో చూడాలి.