
ఎమ్౩ మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి, నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇది. అయితే ఈ చిత్రం “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” అనే టైటిల్ గ్లింప్స్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేస్తూ
నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ‘‘ఈ చిత్రాన్ని మేము లిమిటెడ్ బడ్జెట్‌తో ప్రారంభించాము. కానీ మా హీరో హీరోయిన్‌కి ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది. అందరికి సుపరిచితం అయిన నటీనటులు రాశి గారు, వినోద్ కుమార్ గారు, సురేఖ వాణి గారు, రాజా రవీంద్ర గారు ఇలా చాలా మంది పాపులర్ నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించాము. షూటింగ్ అంత పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” అనే మంచి టైటిల్ తో త్వరలో మీ ముందుకు వస్తాము’’ అని తెలిపారు.
హీరోయిన్ సుప్రీతా నాయుడు మాట్లాడుతూ “సినిమా స్టార్టింగ్ టైంలో నాకు భయం వేసింది కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. మా డైరెక్టర్‌కి థాంక్స్. మా హీరో అమరదీప్‌కి థాంక్స్, షూటింగ్ టైంలో చాలా సపోర్ట్ చేశారు. మా నిర్మాత నన్ను తన ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు. ఈరోజు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాము. విజువల్స్ చాలా బాగున్నాయి” అని తెలిపారు.

నటి సురేఖ వాణి మాట్లాడుతూ “టైటిల్ చాలా బాగుంది. మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. సినిమా చాలా బాగా రావాలి సూపర్ హిట్ కావాలి” అని కోరుకున్నారు.
హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ “టైటిల్ చాలా బాగుంది, నా మొదటి సినిమాకి ఇంత మంచి టైటిల్‌తో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జర్నీలో మహేంద్ర గారు లాంటి మంచి ప్రొడ్యూసర్ ని నేను ఎక్కడా చూడలేదు. సినిమాని నమ్మితే ఎంతైనా ఖర్చు పెడతారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు.. చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమాతో రావాలని అనుకున్నాను, అని కుదరడానికి ఇంత సమయం పట్టింది. “చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి” మంచి సినిమా. మంచి ప్లానింగ్ తో ఈ సినిమా చేసాము. బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
నటీనటులు: అమరదీప్ చౌదరి, సుప్రీతా నాయుడు, సురేఖ వాణి, రాజా రవీంద్ర, రాసి, వినోద్ కుమార్, 6 టీన్స్ రోహిత్, ఎస్తర్, రూప లక్ష్మి, గీత సింగ్, ఆకు మాణిక్ రెడ్డి, మహబూబ్ బాషా, జబర్దస్త్ సత్య శ్రీ, తేజ, స్వామి, తదితరులు
టెక్నికల్ టీమ్:
బ్యానర్: ఎమ్ 3 మీడియా
అసోసియేషన్ విత్: మహా మూవీస్
సమర్పణ: మహర్షి కూండ్ల
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మాల్యాద్రి రెడ్డి
సంగీతం: కె వి జె దాస్
డి ఓ పి: జి వి అజయ్ కుమార్
డైలాగ్: మరుధూరి రాజా
ఫైట్స్: రాజేష్ లంక
ఎడిటర్: మెనగా శ్రీనివాస్
కొరియోగ్రఫీ: గోవింద్ కోటప్
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భాను ప్రియా అడ్డగిరి
ఆడియో: శబరి మ్యూజిక్
పీఆర్ఓ: పాల్ పవన్