చరణ్‌, త్రివిక్రమ్ మధ్య విభేదాలు నిజమేనా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న పెద్ది మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది. అయితే.. చరణ్‌ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మూవీ చేయనున్నారని.. ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రేజీ కాంబో మూవీ ప్రకటన వస్తుంది అనుకుంటే.. నిర్మాత నాగవంశీ.. త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలు వెంకీతో, ఎన్టీఆర్ తో అంటూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఈ విధంగా చరణ్‌, త్రివిక్రమ్ మూవీ లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. తాజాగా ఈ కాంబో మూవీ ఆగిపోవడానికి విభేదాలే కారణమని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఏమైంది..?

త్రివిక్రమ్.. గుంటూరు కారం సినిమా తర్వాత సంవత్సన్నర అయ్యింది కానీ.. కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. ఈమధ్య రామ్ చరణ్‌ ను కలిసారని.. కథ చెప్పారని.. ఈ కాంబో ఫిక్స్ అంటూ ప్రచారం రావడంతో నిజమే అనుకున్నారు సినీ అభిమానులు. నాగ వంశీ క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ లేదని తెలిసింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ లేకపోవడం వెనుక ఓ కారణం ఉందట. అది ఏంటంటే.. చరణ్‌, త్రివిక్రమ్ కలిసి కథ గురించి చర్చించుకున్నారట. సినిమా చేయాలి అనుకున్నారట. కాకపోతే ఏ బ్యానర్ లో సినిమా చేయాలి అనే విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చరణ్‌ ఓ బ్యానర్ లో చేద్దామంటే.. త్రివిక్రమ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే చేద్దామని పట్టుబట్టారట. దీనికి చరణ్ ఒప్పుకోలేదట. అందుకనే ఈ క్రేజీ కాంబో మూవీ డిష్కసన్ స్టేజ్ లోనే ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. అయితే.. చరణ్‌ చెప్పిన బ్యానర్, త్రివిక్రమ్ చెప్పిన బ్యానర్.. ఈ రెండు కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ.. దీనికి ఇద్దరూ ఒప్పుకోలేదట. ఈ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ.. వాస్తవంగా జరగడం లేదు. చరణ్ తోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా చేయాలి అనుకుంటున్నా సెట్ కావడం లేదు.

ఓ వైపు చరణ్, మరో వైపు త్రివిక్రమ్ ఫుల్ బిజీ అయ్యారు. అందుచేత ఈ క్రేజీ కాంబో మూవీ ఇప్పట్లో ఉండకపోపచ్చు. అయినప్పటికీ.. ఓ భారీ చిత్రాల నిర్మాత చరణ్‌, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఓ వార్త వినిపిస్తోంది. మూడు సంవత్సరాల వరకు త్రివిక్రమ్ ఖాళీ లేరు. అలాగే చరణ్‌ కూడా మూడు సంవత్సరాల వరకు ఖాళీ లేరు. ఆతర్వాత ఈ క్రేజీ కలయికలో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి.