ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి త్రివిక్రమ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. గుంటూరు కారం సినిమా రిలీజై సంవత్సరంన్నర అయ్యింది కానీ.. ఇంత వరకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రెండు సినిమాల కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగుతున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏంటి..? తన సినిమా వర్క్ ను పక్కనపెట్టి ఆ రెండు సినిమాల కోసం వర్క్ చేయడానికి కారణం ఏంటి..?

త్రివిక్రమ్.. తన సినిమాల వర్క్ ను పక్కనపెట్టి రెండు సినిమాలకు వర్క్ చేస్తుండడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్.. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాలు వీరమల్లు, ఓజీ. ఇటీవల వీరమల్లు షూటింగ్ ను పవన్ కంప్లీట్ చేశారు. అయితే.. ప్రస్తుతం వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ వర్క్ ను త్రివిక్రమ్ ను చూసుకోమని చెప్పారట పవన్. ఆయన చెబితే ఈయన చేయకుండా ఉంటారా..? అందుకనే వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో తన సలహాలు, సూచనలు ఇస్తూ బెటర్ అవుట్ ఫుట్ వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

ఇక రెండో సినిమా ఏంటంటే.. ఓజీ. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ షూట్ లో పవర్ స్టార్ జాయిన్ అయ్యారు. ఈ మూవీ వర్క్ ను కూడా త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ మూవీ త్వరగా కంప్లీట్ చేయడానికి.. పవన్ కంఫర్టబుల్ గా షూట్ చేయడానికి డైరెక్టర్ సుజిత్ కి త్రివిక్రమ్ అవసరమైన సలహాలు ఇస్తున్నాడని తెలిసింది. ఇక ఈ మూవీ రిలీజ్ ఎప్పుడంటే… సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరి.. ఇది నిజమా..? కాదా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.