
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండడంతో ఈ గ్యాప్ లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ సినిమా గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక స్టార్ తో మూవీ ఫిక్స్ అనుకుంటే.. మరో స్టార్ పేరు ప్రచారంలోకి రావడంతో అసలు త్రివిక్రమ్ మూవీ ఎవరితో అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు కొత్తగా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ.. త్రివిక్రమ్ ప్లాన్ చేస్తోన్న మల్టీస్టారర్ లో నటించే స్టార్స్ ఎవరు..?
త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందని.. ఒక స్టార్ తో కాదని.. ఈసారి మల్టీస్టారర్ ప్లాన్ చేశాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. వెంకీ కోసం త్రివిక్రమ్ కథ రాసాడట. ఆల్మోస్ట్ ఈ కాంబో ఫిక్స్ అయ్యిందట. అయితే.. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించనున్నాడనే ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. చరణ్, త్రివిక్రమ్ ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ.. కుదరడం లేదు. సుకుమార్ కథ రెడీ చేయడానికి టైమ్ కావాలని అడగడంతో ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చరణ్ ఫిక్స్ అయ్యాడట. దీంతో త్రివిక్రమ్ తన ఐడియాను చరణ్ కి చెప్పాడని టాక్.
ప్రస్తుతం చరణ్ పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ వారంలో చరణ్, త్రివిక్రమ్ మధ్య మీటింగ్ జరగనుందని తెలిసింది. ఒకవేళ ప్రాజెక్ట్ సెట్ అయితే.. డేట్లు ఎప్పుడు ఇవ్వాలి…? గెటప్ ఎలా డిజైన్ చేయాలి..? ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఓ సమస్యగా మారే అవకాశం ఉంది. కారణం ఏంటంటే.. త్రివిక్రమ్ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. సంక్రాంతికి చిరు సినిమా వస్తుంది. అలాంటప్పుడు చరణ్ ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి అంతగా ఇష్టపడకపోవచ్చు. పైగా మార్చి 27న పెద్ది రిలీజ్ అవుతుంది. సమ్మర్ లో రిలీజ్ చేసినా నెల రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు చరణ్ నుంచి వచ్చినట్టు అవుతుంది. మరి.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందా..? అయితే.. రిలీజ్ ఎప్పుడు..? ఎలా ప్లాన్ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.