
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిన కథతో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతోంది. అసలు ఐకాన్ స్టార్ తో సినిమా చేయాలని కథ రాసింది ఎవరు..? కథ విని ఐకాన్ స్టార్ ఏమన్నారు..? ఎందుకు ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.? ఎన్టీఆర్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు..? అసలు ఈ కథ రాసిన డైరెక్టర్ ఎవరు..? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని కథ రాసిన డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బన్నీతో సినిమా చేయాలని వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. అయితే.. బన్నీ మాత్రం త్రివిక్రమ్ తో సినిమా చేయకుండా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాకి ఓకే చెప్పాడు. ఇది త్రివిక్రమ్ కు షాక్ అనే చెప్పచ్చు. బన్నీ.. త్రివిక్రమ్ తో సినిమా చేస్తాననే అంటున్నారు.. ఇంకో ఆరు నెలలు వెయిట్ చేయమంటున్నారట. ఇది త్రివిక్రమ్ అండ్ ప్రొడక్షన్ హౌస్ కు ఇబ్బందిగా ఉండడంతో మరో ఆప్షన్ చూసారు. అదే.. వెంకీతో సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది.
వెంకీతో సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ట్రై చే్స్తున్నారు. వెంకీ, చరణ్ లతో సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత బన్నీ కోసం రాసిన కథతో సినిమా చేయాలి అనుకుంటున్నారట త్రివిక్రమ్. అయితే.. బన్నీ కోసం రాసిన మైథలాజికల్ స్టోరీతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మైథలాజికల్ స్టోరీ ఎన్టీఆర్ కు బాగా సెట్ అవుతుంది. అందుచేత ఎన్టీఆర్ నో చెప్పకపోవచ్చు. దీనికి సంబంధించి టాక్స్ జరుగుతున్నాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ తో సినిమా చేయడం అనేది ఆలస్యం అవుతుంది అనుకుంటే.. వెంకీతో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైథలాజికల్ స్టోరీని తెరకెక్కించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. అయితే.. ఇదే బ్యానర్ లో ఎన్టీఆర్, నెల్సన్ కాంబో మూవీ ఉంది. ఈ సినిమా అయిన తర్వాతే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వస్తుందని అంటున్నారు. ఈ లెక్కన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే టైమ్ పడుతుంది. ఏది ఏమైనా.. బన్నీ చేసిన పనికి త్రివిక్రమ్ బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. మరి.. త్రివిక్రమ్ ప్లాన్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతాయో.. ఏం జరగనుందో చూడాలి.