
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. గుంటూరు కారం అనే సినిమా రిలీజ్ చేసి సంవత్సరం దాటేసింది కానీ.. ఇంత వరకు కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి. అయితే.. గురుజీ సినిమా కంటే ముందుగా బన్నీ.. అట్లీతో సినిమాను చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్ సినిమా వెనక్కి వెళ్లింది. మరి.. మాటల మాంత్రికుడు ఏం చేస్తాడంటే.. విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు వెంకీ, త్రివిక్రమ్ మధ్యలో సమంత వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఏమైంది..? గురుజీ ప్లాన్ ఏంటి..?
గుంటూరు కారం సినిమా పై విమర్శలు వచ్చాయి. త్రివిక్రమ్ ఎప్పుడూ రెగ్యులర్ కథలతోనే సినిమాలు తీస్తాడని.. ఒక ఇల్లు.. ఆ ఇంటిలో ఓ సమస్య.. ఆ సమస్యను హీరో సాల్వ్ చేయడం.. ఇదే కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇలా త్రివిక్రమ్ పై విమర్శలు రావడంతో ఈసారి రూటు మార్చి భారీగా మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా చేయాలి అనుకున్నాడు. దీని కోసం బన్నీని సెలెక్ట్ చేసుకున్నాడు. స్టోరీ ఐడియా చెబితే వెంటనే ఓకే చెప్పాడు. ఇక త్రివిక్రమ్ కథ రెడీ చేశాడు. అయితే.. బన్నీ కోసం అట్లీ ఇంటర్నేషనల్ స్టోరీ రెడీ చేశాడు. పుష్ప 2 తర్వాత ఆ సినిమా చేస్తే బాగుంటుందని ఆ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యాడు.
బన్నీ.. అట్లీతో సినిమా చేసే లోపు త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. వెంకీ కోసం కథ రెడీ చేశాడు. ఈ సినిమాను త్వరలో స్టార్ట్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. సమంత త్రివిక్రమ్ ను ఓ కథ రాయని గతంలో ఓ ఈవెంట్ లో అడగడం జరిగింది. ఆతర్వాత త్రివిక్రమ్ సమంత కోసం ఓ కథ రెడీ చేశాడట. ఇప్పుడు సమంత శుభం సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించడంతో మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలి అనుకుంటుందట. ఇదే విషయం త్రివిక్రమ్ కి చెబితే సినిమా చేద్దామన్నాడని టాక్. దీంతో త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ వెంకీతోనా..? సమంతోనా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి.