
ప్రముఖ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh), టాలీవుడ్ యువ నటుడు సుహాస్(Suhas) కీలక పాత్రలు పోషించిన సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్(Uppu Kappurambu Music Album)ను అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే గ్రామీణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతం అందించగా, రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం, రఘురాం ద్రోణావజ్జల సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ గాయకులు సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్ గానంతో పాటలు ఇంకా హృద్యంగా మారాయి. ఒకవైపు నోమిలాలా అనే పాట ఉత్సవాన్ని నింపేలా ఉంటే, మరోవైపు యాడున్నావో అనే పాట తల్లీబిడ్డ మధ్య దూరాన్ని హృదయాన్ని తాకేలా చూపుతుంది. అలాగే టైటిల్ సాంగ్ ఉప్పు కప్పురంబు పాటలో గ్రామీణ శైలి, ఉల్లాసం, ధైర్యం అన్నీ కలిసి ఉంటాయి. ఈ పాటలు ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, ఆపిల్ మ్యూజిక్ లాంటి ప్రముఖ మ్యూజిక్ యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. Uppu Kappurambu Music Album
Also Read: కన్నప్పకు ప్రభాస్ దూరం.. అసలు కారణం ఇదే.!