పవన్, విజయ్ లను కంగారు పెడుతున్న ఆ రెండు సినిమాలు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. క్రిష్‌, జ్యోతికృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. ఇక విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఈ భారీ, క్రేజీ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఏం జరుగుతోంది..? ఎందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతుంది..? వీరమల్లు, కింగ్ డమ్ రిలీజ్స్ పై క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

వీరమల్లు సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 12న రావడం పక్కా అంటూ ప్రచారం చేశారు కానీ.. లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేశారు. ఆతర్వాత ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అయ్యిందని అప్ డేట్ ఇచ్చారు కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో నిర్మాత ఏఎం రత్నం వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం మరిచిపోయారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. జూన్ 12న వీరమల్లు రిలీజ్ అంటూ నిర్మాత ఏఎం రత్నం కొన్ని న్యూస్ ఛానల్స్ కి ఇంటర్ వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. ఆతర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాలేదంటూ పోస్ట్ పోన్ చేయడం పై న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక కింగ్ డమ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. విజయ్ దేవరకొండ నటించిన లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు రెండు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కథ పై చాన్నాళ్లు కసర్తు చేశాడు. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో విజయ్ కు సక్సెస్ అందించాల్సిన బాధ్యత గౌతమ్ పై ఉంది. దీంతో స్టోరీ పై రీ వర్క్ చేశారని.. టాక్ వినిపించింది. ఈ సినిమాను మే 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత జులై 4న రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ.. ఈసారి కూడా రావడం లేదని తెలిసింది.

ఈ సినిమా కోసం రీషూట్స్ చేస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఇటీవల త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా గురించి.. త్రివిక్రమ్, చరణ్‌ మూవీ గురించి క్లారీటీ ఇచ్చాడు కానీ.. కింగ్ డమ్ విడుదల ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. సమ్మర్ లో రావాల్సిన ఈ రెండు సినిమాలు సమ్మర్ వెళ్ళిపోయినా… ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తాయో క్లారిటీ లేదు. మరి.. ఈ రెండు సినిమాల పై క్లారిటీ వచ్చేది ఎప్పుడంటే.. నెక్ట్స్ మంత్ జులైలో వీరమల్లు, కింగ్ డమ్ విడుదల ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తారని సమాచారం.