
Veeramallu breaks Pushpa 2 record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు గురించి.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెర పై ఈ బొమ్మ కనిపిస్తే చాలు థియేటర్స్ లో పూనకాలే. అయితే.. పవర్ స్టార్ నుంచి వీరమల్లు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పలుమార్లు వాయిదాపడిన వీరమల్లు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇటీవల వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయడం.. యూట్యూబ్ ని షేక్ చేయడం తెలిసింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ కి ముందే పుష్ప 2 రికార్డ్ ను బద్దలుకొట్టింది. ఇంతకీ.. ఏంటా రికార్డ్..?
వీరమల్లు సినిమా ఆలస్యం అవ్వడం వలన నిజం చెప్పాలంటే.. బజ్ అంతగా లేదు. ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆ.. ఏముంటుంది లే అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే.. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయ్యిందో ఇక అప్పటి నుంచి ఊహించని విధంగా ఈ ట్రైలర్ దూసుకెళుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు వీరమల్లు ట్రైలర్ తెగ నచ్చేసింది. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ మూవీ చేయడం.. అలాగే పవన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో చాలా కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతి సీన్ లో వావ్ అనిపించేలా అదరగొట్టేసాడు.
ఇక రికార్డ్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 48 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో వీరమల్లు ట్రైలర్ తెలుగులో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో హయ్యస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్ గా పుష్ప 2 ఉంది. పుష్ఫ 2 ట్రైలర్ 44 మిలియన్ వ్యూస్ సాధిస్తే.. వీరమల్లు 48 మిలియన్స్ వ్యూస్ సాధించి బన్నీ రికార్డ్ ను బద్దలుకొట్టింది. ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. ఈసారి రిలీజ్ డేట్ మారదు.. రికార్డులు మారతాయి అని చెప్పారు. ట్రైలర్ రికార్డులు చూస్తుంటే.. మేకర్స్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. Veeramallu breaks Pushpa 2 record.
ఇలా వీరమల్లు ట్రైలర్ న్యూ రికార్డ్ సెట్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఏమాత్రం బజ్ లేని.. బాగా ఆలస్యం అయిన ఈ సినిమాకి ట్రైలర్ తో అంత క్రేజ్ వచ్చిందంటే.. దానికి కారణం వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్. ఇదే జోష్ లో భారీగా ప్రమోషన్స్ చేసి.. భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే.. అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. మేకర్స్ ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ నెల 24న వీరమల్లు విధ్వంసం మూమూలుగా ఉండదు.. కలెక్షన్స్ సునామీ ఖాయం అంటున్నారు. మరి.. వీరమల్లు ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.