
Highlights of Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు.. సినీ అభిమానులందరి నోటా ఇప్పుడు వినిపిస్తున్న మాట వీరమల్లు. ఐదేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. ఈ నెల 24న భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి వీరమల్లు పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. అయితే.. వీరమల్లు హైలెట్స్ ఏంటో కథానాయిక నిథి అగర్వాల్ బయటపెట్టింది. ఇంతకీ.. నిధి ఏం చెప్పింది..? వీరమల్లు హైలెట్స్ ఏంటి..?
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిధి అగర్వాల్.. ఆతర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి వీరమల్లు సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో తన కెరీర్ మారుతుందని.. ఎన్నో ఆఫర్స్ వస్తాయని.. ఆశలు పెట్టుకుంది. అయితే.. ఊహించని విధంగా వీరమల్లు మూవీ ఆలస్యం అయ్యింది. ఈ మూవీ విడుదల అవ్వడం ఎంత లేట్ అయినా ఎన్నో ఆశలతో వెయిట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు రిలీజ్ అవుతుండడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాట్ చేసింది. ఈ సినిమా చాలా బాగుంటుందని.. అందరికీ నచ్చుతుందని చెప్పింది.
అంతే కాకుండా వీరమల్లు హైలెట్స్ ఏంటి అనేది బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందట. ఇంటర్వెల్ తర్వాత కూడా ఆ ఊపు కంటిన్యూ అవుతుందట. ఇక క్లైమాక్స్ అయితే.. వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పింది. మొత్తంగా చూసుకుంటే.. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోతుందని.. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం ఖాయమని నిధి అగర్వాల్ చెప్పింది. వీరమల్లు గురించి నిధి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే మరింతగా అంచనాలు పెంచేశాయి. Highlights of Veeramallu.
సాధారణంగా ఒక సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవ్వడం.. నిర్మాణం చేపట్టి ఐదు సంవత్సరాలు అవ్వడం జరిగితే… అలాంటి సినిమాల మీద అంతగా బజ్ క్రియేట్ అవ్వదు. జనాలు ఏమాత్రం అలాంటి సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే.. అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకనే ఆయన సినిమా నిర్మాణం చేపట్టి ఎన్ని సంవత్సరాలు అయినా.. ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయినా జనాలు మాత్రం వీరమల్లు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నెల 24న వీరమల్లు పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. వీరమల్లు ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.