
Veeramallu Release Date Fixed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న.. ఎక్కువ రోజులు వాయిదాలు వేసిన సినిమా కూడా ఇదే. ఈ రకంగా కూడా వీరమల్లు రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పచ్చు. జూన్ 12న రావాల్సిన వీరమల్లు పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ ప్రచారంలోకి వచ్చింది. అయితే.. ఈ డేట్ కి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఇంతకీ.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు..? ఈ డేట్ వెనకున్న సెంటిమెంట్స్ ఏంటి..? వీరమల్లుకు సెంటిమెంట్ కలిసొస్తుందా..? లేదా..?
వీరమల్లు సినిమాకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అసలు ఇన్ని అడ్డంకులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అడ్డంకులు అన్నింటినీ దాటుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాడు వీరమల్లు. ఇంతకీ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. జులై 24 అని సమాచారం. ఈసారి అంతా పక్కాగా సెట్ అయిన తర్వాతే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలని ఫిక్స్ అయ్యారు. అలాగే ప్రమోషన్స్ ను కూడా మళ్లీ కొత్తగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత ఏఎం రత్నం ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్ కి ఇంటర్ వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియా పై ఫోకస్ చేయనున్నారని సమాచారం. Veeramallu Release Date Fixed.
ఇక న్యూ రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఏంటంటే.. 1998 జూలై 24 పవన్ కళ్యాణ్ తొలిప్రేమ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా విభిన్న ప్రేమకథా చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు పెట్టిన నైజాం హక్కుల మొత్తాన్ని ఒక్క సంధ్య 70 ఎంఎం థియేటర్ లోనే రాబట్టంది. దీనిని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పొచ్చు యూత్ లో పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ మొదలయ్యింది తొలిప్రేమ నుంచే. ఆతర్వాత 2002 జూలై 24 ఇంద్ర రిలీజయ్యింది. అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టిన మెగాస్టార్ కొన్నేళ్ల పాటు వాటిని తానే బద్దలు కొట్టలేకపోయారు.
నాడు తొలిప్రేమ, ఇంద్ర సినిమాల రిలీజ్ డేట్ రోజునే రాబోతున్న వీరమల్లు సినిమాకి ఈ సెంటిమెంట్ బాగా కలిసొస్తుందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ను అభిమానులే కాదు.. సినీ జనాలు కూడా బాగా నమ్ముతుంటారు. ఈ నమ్మకమే నిజమైతే కనుక వీరమల్లు బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అని చెప్పచ్చు. ఈ సినిమా విజయం అందరి కంటే ఎక్కువుగా నిర్మాత ఏఎం రత్నంకు చాలా అంటే చాలా అవసరం. చాన్నాళ్లు నిర్మాణంలో ఉంది. మరి.. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించి వీరమల్లుకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.