
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘రానా నాయుడు సీజన్ 2’లో నాగ నాయుడుగా వెంకటేష్ దగ్గుబాటి తిరిగి రాబోతున్నారు. కానీ వెంకటేష్, నాగ నాయుడుకి చాలా తేడా ఉంటుంది. నాగ నాయుడు స్వార్థపరుడు, నియమాలను ఉల్లంఘిస్తుంటాడు. కానీ నిజ జీవితంలో వెంకటేష్ మాత్రం ఇలాంటి వాటన్నంటికీ దూరంగా ఉంటారు.
తాను పోషించిన నాగ నాయుడు పాత్ర గురించి వెంకటేష్ మాట్లాడుతూ ‘‘నాగ నాయుడు కుటుంబం కోసం ఎంతటి వరకు అయినా వెళ్తాడు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అదే అతన్ని మనం గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. నాగ నాయుడు పాత్రని మనం ఊహించలేం. ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. కానీ అతను తన కుటుంబం కోసం ప్రాణం ఇస్తాడు. అదే నాకు కనెక్ట్ అయిన పాయింట్. నిజ జీవితంలో నాకు ఆ పాత్రకు ఉన్న కనెక్షన్ అదే. మేమిద్దరం మా కుటుంబాలను ప్రేమిస్తాము. కానీ అక్కడే ఎంతో తేడా ఉంటుంది. నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించగలరు. కానీ నాగ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. నాగకి డ్రామా అంటే ఎక్కువగా ఇష్టం. నాకు మైండ్ గేమ్స్ ఆడటం ఇష్టం ఉండదు. నేను ఆడను. కానీ నాగ అలాంటి ఆటల్లో ఆశ్చర్య పరుస్తుంటాడు. అతను ఏమి ఆలోచిస్తుంటాడో మనకు తెలియదు.. అస్సలు ఊహించలేం.. ఈ సారి అభిమానుల్ని మరింతగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది’’ అని అన్నారు.
రానా నాయుడు సీజన్ 2 మొత్తం యాక్షన్, డ్రామాతో నిండి ఉంటుంది. నాగ నాయుడు 2.0 పూర్తి స్థాయి ధమాకాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.