ఫుల్ స్పీడ్ లో వెంకీ.. నాలుగు సినిమాలు ఫిక్స్..!

Venkatesh Upcoming Movies: విక్టరీ వెంకటేష్‌ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో వెంకీ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు కొన్ని ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చినా.. ఇప్పుడు అవేమీ కాకుండా సరికొత్త సినిమాలు ఫైనల్ అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రాజెక్టులును వెంకీ ఫైనల్ చేశారని తెలిసింది. ఇంతకీ.. వెంకీ ఫైనల్ చేసిన ఆ నాలుగు ప్రాజెక్టులు ఏంటి..?

వెంకీ ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ముఖ్యపాత్ర పోషించడంతో పాటు వెంకీ పై ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశాడట సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజా షెడ్యూల్ లో చిరు, వెంకీల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. మెగా 157 గా రూపొందుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి పక్కా ప్లానింగ్ తో చాలా స్పీడుగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. Venkatesh Upcoming Movies.

ఈ సినిమా తర్వాత వెంకీ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించి త్రివిక్రమ్ ప్రస్తుతం డైలాగ్ వెర్సెన్ రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమాని పట్టాలెక్కంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు కథ – మాటలు అందించారు త్రివిక్రమ్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ వెంకీని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

మలయాళంలో దృశ్యం సినిమా ఎంతటి విజయం సాధించింతో తెలిసిందే. తెలుగులో వెంకీ రీమేక్ చేస్తే.. ఇక్కడ కూడా అదే రేంజ్ లో సక్సెస్ సాధించింది. ఆతర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేశారు. పార్ట్ 2 డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మలయాళంలో దృశ్యం పార్ట్ 3 ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించి ఒకేసారి మూడు భాషల్లో 2026 అక్టోబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ చేయడానికి వెంకీ రెడీనే. కాకపోతే ఈ సినిమాలు పూర్తవ్వాలి. మెగా 157, త్రివిక్రమ్ తో మూవీ, దృశ్యం 3, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇలా వెంకీ నాలుగు సినిమాలు చేస్తున్నారని తెలిసింది. మరి.. ఈ నాలుగు సినిమాలతో వెంకీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/who-are-the-two-star-heroes-who-rejected-the-movie-kuberaa/