వెంకీ, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే!

Venky and Trivikram Movie: విక్టరీ వెంకటేష్‌.. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి.. రీజినల్ మూవీస్ లో హయ్యాస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించాడు. దీంతో వెంకీ నెక్ట్స్ ఏంటి..? అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. చాలా కథలు విని ఫైనల్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా గురించి వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. తాజాగా వెంకీ మూవీ టైటిల్ లీకైంది. ఇంతకీ.. వెంకీ, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఏంటి..? ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

వెంకీకి ఇది 77వ సినిమా. వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ కథ – మాటలు అందించాడు కానీ.. డైరెక్షన్ చేయలేదు. ఎప్పటి నుంచో వెంకీ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ ప్లాన్ చేసినా కుదరలేదు. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యింది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్ టైన్మెంట్ ఉంటూనే ఎమోషన్ ఉండేలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ స్టోరీని రెడీ చేశాడట త్రివిక్రమ్. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా అంటే అంచనాలు బాగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

అయితే.. ఈ సినిమాకి ఆమధ్య ఆనందరావు అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్ వినిపించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాకి వెంకట రమణ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. దీనికి కేరాఫ్ ఆనంద నిలయం అనేది ట్యాగ్ లైన్. ఈ టైటిల్ ను బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అర్థమౌతుంది. ప్రస్తుతం డైలాగ్ వెర్షెన్ రాస్తున్నారట. త్వరలోనే ఈ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట చేయనున్నాడు. ఓ వైపు ఇందులో నటించే నటీనటుల ఎంపిక జరుగుతూనే లోకేషన్స్ సెర్చింగ్ కూడా చేస్తున్నారట. ఎప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేస్తారంటే.. ఆగష్టులో ఈ సినిమాని స్టార్ట్ చేస్తారని తెలిసింది. Venky and Trivikram Movie.

ఈ సినిమాని ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కారణం ఏంటంటే.. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వెంకీ ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. అందుకనే రానున్న సంక్రాంతికి కూడా ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలి అనుకున్నాడట. అయితే.. వెంకీ.. చిరు, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా సంక్రాంతికి వస్తుండడంతో ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో ప్లాన్ మార్చారట. ఇంతకీ.. ఎప్పుడు రిలీజ్ అంటే.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి.. వెంకీ, త్రివిక్రమ్ కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/nithins-latest-movie-thammudu-has-disappointed-at-the-box-office-nithin-career-is-full-of-flops/