
టాలీవుడ్‌లో మరో ఇంటరెస్టింగ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా నిన్న (మే 19, 2025) ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ మూవీస్ రూపొందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ధనుష్ కూడా ఒక కీ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఈ మూవీ మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభమై… 2026 సమ్మర్ లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించనున్నాడు.
ప్రముఖ నిర్మాత నాగవంశీ గత చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సూర్య, వెంకీ అట్లూరి, మమిత బైజు కలయికలో రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా ఒక బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది.
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సూర్య.. ఆకాశమే నీ హద్దు రా.. జై భీమ్, విక్రమ్ వంటి విభిన్న కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆయనకున్న సెపరేట్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయాలనుందని సూర్య తన ఒపీనియన్ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరుగగా ఏదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మాత్రం వరుసగా తెలుగు డైరెక్టర్స్ తో స్టోరీ నరెషన్ వింటున్నాడని తెలుస్తోంది. ఈ తోవలోనే చందూ మొండేటితో సూర్య స్టోరీ డిస్కస్ చేశాడట. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం.