
Venky in Anil Ravapudi Movie: విక్టరీ వెంకటేష్.. నాటి నుంచి నేటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. ఈమధ్య సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో 300 కోట్లకు పైగా వసూలు చేయడంతో చరిత్ర సృష్టించాడు. అయితే.. కొత్త సినిమాను ఇంకా ప్రకటించలేదు కానీ.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించబోతున్నాడని మాత్రం తెలిసింది. వెంకీ కొత్త సినిమా ఎప్పుడు..? ఎవరితో..? మెగాస్టార్ తో వెంకీ నటించే సినిమా అప్ డేట్ ఏంటి..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే.. ఈ వీడియో చూడాల్సిందే.
విక్టరీ వెంకటేష్.. కథ నచ్చితే.. అందులో అతని క్యారెక్టర్ నచ్చితే ఎవరితో సినిమా చేయడానికైనా రెడీ అంటారు. ఆమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి వెంకటేష్ గోపాల గోపాల అనే సినిమాలో నటించారు. వెంకీ, పవన్ కలిసి నటించిన గోపాల గోపాల కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ మంచి లాభాలు అందించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకటేష్ నటించబోతున్నారని తెలిసింది. గత కొన్ని రోజులుగా ఈ కాంబో మూవీ గురించి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ వార్త పై మరింతగా క్లారిటీ వచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో వెంకీ జాయిన్ అవుతారని సమాచారం. ఈ మూవీ కోసం వెంకీ నెల రోజులు పాటు డేట్స్ ఇచ్చారట. దీంతో వెంకీ ఏ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు..? చిరు, వెంకీ మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయి..? అనేది ఆసక్తిగా మారింది. వెంకీ షూట్ లో జాయిన్ అయిన రోజున అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్. Venky in Anil Ravapudi Movie.
ఇక వెంకీ సోలో హీరోగా నటించే మూవీ అప్ డేట్ ఏంటంటే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ సినిమా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ చిత్రాల వలే ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఏది ఏమైనా.. చిరు, వెంకీ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే.. సినీ అభిమానులకు పండగే. మరి.. వీరిద్దరూ కలిసి ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/the-upcoming-projects-of-king-nagarjuna-and-his-latest-movie-update/