బన్నీ అడిగినా.. ఐకాన్ టైటిల్ ఇవ్వరా..?

Icon Movie Title: ఐకాన్.. టైటిల్ తో బన్నీ సినిమా చేయాలి. వేణు శ్రీరామ్ ఈ కథను రెడీ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నారు. టైటిల్ రిజిష్టరేషన్ కూడా చేశారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఐకాన్ పట్టాలెక్కుండా ఆగిపోయింది. ఇప్పుడు ఐకాన్ సినిమాను వేరే హీరోతో చేయాలి అనుకుంటున్నాడు వేణు శ్రీరామ్. బన్నీ.. అట్లీతో సినిమా చేస్తున్న మూవీకి ఐకాన్ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. మరి.. బన్నీ ..వేణు శ్రీరామ్ ని ఐకాన్ టైటిల్ అడిగితే ఇస్తాడా..? అసలు బన్నీ నిజంగానే తన సినిమాకి ఐకాన్ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నాడా..? ఇంతకీ.. వేణు శ్రీరామ్ ఐకాన్ లో నటించే హీరో ఎవరు..? Icon Movie Title.

తమ్ముడు సినిమాని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ నెక్ట్స్ ఐకాన్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. అయితే.. బన్నీ, అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీకి కూడా ఐకాన్ అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందట. పైగా అది పాన్ వరల్డ్ మూవీ. అందుచేత ఐకాన్ టైటిల్ నే ఫిక్స్ చేయాలి అనుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంతే కాకుండా బన్నీని ఐకాన్ స్టార్ అని పిలుస్తుండడం తెలిసిందే. ఈ టైటిల్ అయితేనే క్యాచీగా ఉంటుంది.. పర్ ఫెక్ట్ గా ఉంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

మేటర్ ఏంటంటే.. ఈ టైటిల్ కోసం బన్నీ కానీ.. అట్లీ కానీ… డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని కాంటాక్ట్ చేయలేదట. అయితే.. ఈ టైటిల్ కావాలని అడిగినా ఇవ్వడానికి వేణు శ్రీరామ్ రెడీగా లేడట. ఎందుకంటే తన కథని ఈ టైటిల్ తో ఆయన స్క్రీన్ పై ఎప్పటికైనా చూడాలి అనుకుంటున్నారట. బన్నీ ప్లేస్ లో మరో స్టార్ హీరోతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఎవరా స్టార్ హీరో అంటే.. విజయ దేవరకొండ పేరు వినిపిస్తుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాని రిలీజ్ కి రెడీ చేసే బిజీలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్థన్ అనే సినిమా చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాహుల్ సాంకృత్యన్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాల తర్వాత విజయ్.. వేణు శ్రీరామ్ తో సినిమా చేస్తాడా..? లేక విజయ్ కాకుండా మరో హీరోతో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సివుంది. అయితే.. బన్నీ ఐకాన్ టైటిల్ దక్కించుకోవాలి అనుకుంటే పెద్ద కష్టమేం కాదు. దిల్ రాజుని అడిగితే ఆయన కాదనకుండా ఇచ్చేస్తారు. అప్పుడు వేణు శ్రీరామ్ మరో టైటిల్ చూసుకోవాలి. బన్నీతో సినిమా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అందుచేత బన్నీ అడగాలే కానీ.. టైటిల్ ఇవ్వడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు. అయితే.. బన్నీ, అట్లీ ఐకాన్ టైటిల్నే పెడతారా..? లేక వేరే టైటిల్ పెడతారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/megastar-chirus-birthday-treat-is-on-another-level-planned-by-anil-ravipudi-from-mega-157/