టెన్షన్ లో విజయ్.. అసలు ఏమైంది..?

Vijay Devarakonda’s Kingdom: విజయ్ దేవరకొండ ఎంత ఫాస్ట్ గా సక్సెస్ సాధించాడో.. అంతే ఫాస్ట్ గా ఫ్లాప్స్ చూశాడు. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ చూడడంతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇప్పుడు సరైన సక్సెస్ కోసం తపిస్తున్నాడు. విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. చాలా రోజులు నుంచి నిర్మాణంలో ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన కింగ్ డమ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. న్యూ రిలీజ్ డేట్ ఇంత వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే.. న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని.. అయితే.. విజయ్ టెన్షన్ పడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు..? విజయ్ టెన్షన్ పడడానికి కారణం ఏంటి..?

లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవ్వడంతో కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు విజయ్. ఈసారి పక్కాగా బ్లాక్ బస్టర్ సాధించాలని ఎంతో కసితో కింగ్ డమ్ అనే సినిమా చేశాడు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమా ఇది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా టీజర్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడంతో మరింతగా రీచ్ అయ్యింది. అలాగే మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ మూవీని మే 30న విడుదల చేయాలి అనుకున్నారు. అఫిషియల్ గా అనౌన్స్ చేశారు కానీ.. లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేశారు.

ఈ సినిమాని జులై 25న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. ఈ నెల 24న వీరమల్లు వస్తుండడంతో ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో జులై 31న కింగ్ డమ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా రిలీజైన రెండు వారాలకు అంటే ఆగష్టు 14న రజినీ, నాగ్ ల కూలీ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో వైపు ఆగష్టు 14నే హృతిక్ – ఎన్టీఆర్ ల వార్ 2 సినిమా విడుదల కానుంది. ఇలా కింగ్ డమ్ రిలీజైన రెండు వారాలకు రెండు భారీ, క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండడం ఆసక్తిగా మారింది. Vijay Devarakonda’s Kingdom.

అయితే.. కింగ్ డమ్ భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా. పైగా నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకుంది. ఎంత కలెక్ట్ చేసినా రెండు వారాల్లోనే కలెక్ట్ చేయాలి. ఆతర్వాత వార్ 2, కూలీ వస్తుండడంతో కింగ్ డమ్ సక్సెస్ అయినా థియేటర్స్ నుంచి తీసేయాల్సి వస్తుంది. పైగా వార్ 2 సినిమాని కింగ్ డమ్ నిర్మాత నాగవంశీనే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. అందువలన ఆయనకు వార్ 2 కోసం కింగ్ డమ్ మూవీని థియేటర్స్ ని తీసేసి వార్ 2 వేయాల్సి రావచ్చు. అందుచేత కింగ్ డమ్ ఎంత కలెక్ట్ చేసినా రెండు వారాల్లోనే చేయాలి. ఈ విషయం గురించే విజయ్ టెన్షన్ పడుతున్నాడట. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇటీవల కొన్ని సీన్స్ రీషూట్ చేశాడు. ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. కింగ్ డమ్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/who-is-sekhar-kammulas-next-movie-with-natural-star-nani-or-samantha/