విజయ్ వస్తాడనుకుంటే.. నితిన్ వస్తున్నాడా..?

సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. రిలీజ్ చేయడం అనేది మరో ఎత్తు. అలాగే సినిమా తీయడం అనేది కష్టం. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఈజీగా ఉంటుంది కానీ.. విడుదల చేయడం అనేది కష్టంగా మారింది. ఒక సంవత్సరం క్రితం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినా.. అనౌన్స్ చేసిన డేట్ కి సినిమా రిలీజ్ కావడం లేదు. ఒక సినిమా రిలీజ్ డేట్ మారితే.. మిగిలిన సినిమాల రిలీజ్ డేట్స్ మార్చాల్సి వస్తుంది. విజయ్, నితిన్ ఈ ఇద్దరి సినిమాల విడుదల తేదీ అనేది సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలా తయారైంది. విజయ్, నితిన్ సినిమాల రిలీజ్ డేట్స్ మళ్లీ మారాయని తెలిసింది. ఇంతకీ.. ఈ ఇద్దరి సినిమాలు వచ్చేది ఎప్పుడు..? అసలు ఏమైంది..?

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఇది శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విభిన్న కథా చిత్రం. ఈ సినిమాని మే 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. మే 30న వీరమల్లు రావాలి అనుకోవడంతో కింగ్ డమ్ మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాను జులై 4న కింగ్ డమ్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు కింగ డమ్ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ప్రస్తుతం రీషూట్స్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ నటించిన లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. అందుచేత ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే కింగ్ డమ్ మూవీ పై మరింత కేర్ తీసుకుంటున్నారట. ఈ సినిమాను రెండు పార్టులుగా తీయాలి అనుకున్నారు. రెండు పార్టులుగా తీస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఆతర్వాత సినిమా హిట్ అయితే.. రెండు పార్టులుగా తీసేలా కథలో మార్పులు చేర్పులు చేశారని తెలిసింది.

ఇక నితిన్ సినిమా విషయానికి వస్తే.. తమ్ముడు సినిమాలో నటించాడు. దీనికి వేణు శ్రీరామ్ డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత జులై 4న తమ్ముడు మూవీ వస్తుందని ప్రకటించారు. ఏమైందో ఏమో కానీ.. తమ్మడు సినిమా ప్లేస్ లో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వస్తుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు కింగ్ డమ్ పోస్ట్ పోన్ అయ్యిందట. ఈ సినిమా ప్లేస్ లో నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఇలా విజయ్ కింగ్ డమ్, నితిన్ తమ్ముడు సినిమాల రిలీజ్ డేట్ అనేది ముందుకు వెనక్కి మారుతున్నాయి. మరి.. ఫైనల్ గా ఎప్పుడు వస్తాయో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మెప్పిస్తుందో చూడాలి.