
విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన మూవీ పెళ్లిచూపులు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా మంచి విజయం సాధించింది. దీంతో విజయ్, తరుణ్ ఇద్దరి కెరీర్లు మారిపోయాయి. అయితే.. విజయ్ హీరోగా చాలా స్పీడుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక తరుణ్ భాస్కర్ విజయ్ అంత స్పీడుగా సినిమాలు చేయడం లేదు. డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్ భాస్కర్.. మధ్యలో నటుడుగా మారి కొన్ని సినిమాలు చేశాడు. ఇదిలా ఉంటే.. విజయ్, తరుణ్ కాంబోలో బినామి మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. ఇది నిజమేనా.? లేక గాసిప్పా..?
2016లో పెళ్లి చూపులుతో దర్శకుడు తరుణ్ భాస్కర్ అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. విజయ్ దేవరకొండకి తొలి హిట్టు ఇచ్చిన ఘనత తనకే దక్కింది. తర్వాత ఈ నగరానికి ఏమైంది కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా యూత్ లో దానికున్న కల్ట్ ఫాలోయింగ్ రీ రిలీజ్ టైంలో బయట పడింది. రెండేళ్ల క్రితం కీడా కోలాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఆతర్వాత మళ్లీ తరుణ్ భాస్కర్ నుంచి సినిమా రాలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో బినామి అనే సినిమా చేయబోతున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది.
ఇది నిజమా..? లేక గాసిప్పా..? అంటే ఈ సినిమా చేయాలి అనుకున్నారట కానీ.. డిస్కషన్ స్టేజ్ లోనే ఆగిపోయిందని తెలిసింది. ఆతర్వాత విజయ్ బిజీ అయ్యాడు. కింగ్ డమ, రౌడీ జనార్థన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాలతో రెండేళ్ల వరకు ఖాళీ లేడు. మరి.. తరుణ్ భాస్కర్ ఏం చేస్తున్నాడంటే.. ఈ నగరానికి ఏమైంది 2 కథ పై కసరత్తు చేస్తున్నాడట. ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. తరుణ్ భాస్కర్ టాలెంటెడ్ డైరెక్టర్. అయితే.. ఎందుకనో స్పీడుగా సినిమాలు చేయడం లేదు. మరి.. తరుణ్ భాస్కర్ ఎప్పుడు స్పీడు పెంచుతాడో.. ఎప్పుడు కొత్త సినిమా చేస్తాడో చూడాలి.