
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ ఇవ్వడంతో నెక్ట్స్ సినిమా చాలా కీలకం అయ్యింది. చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తన కథతో మెప్పించడం.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అవ్వడం తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ టైటిల్ కాదని.. మరో వెరైటీ టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వార్తల్లో నిలిచిన ఈ టైటిల్ చూసి ఇదేం టైటిల్ పూరి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ప్రచారంలో ఉన్న ఆ టైటిల్ ఏంటి..? పూరి ప్లాన్ ఏంటి..?
విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా అని ప్రచారం మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకి టైటిల్ బెగ్గర్ అంటూ ప్రచారం మొదలైంది. పాన్ ఇండియా సినిమా అంటే.. అన్ని భాషలకు తెలిసే టైటిలే పెట్టాలి. బెగ్గర్ అనే పదం అందరికీ తెలుసు కాబట్టి ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారంటూ టాక్ వినిపించింది. అయితే.. తమిళనాడులో సినిమా టైటిల్స్ తమిళ్లోనే పెట్టాలి. ఇంగ్లీషు టైటిల్ పెట్టడానికి అంతగా ఇష్టపడరు. పెట్టిన ఆ టైటిల్ కు అక్కడ అంతగా రీచ్ ఉండదు. అంతే కాకుండా తమిళ సినీ ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అందుకనే.. విజయ్ సేతుపతి బెగ్గర్ టైటిల్ కాకుండా మరో టైటిల్ చూడమని చెప్పాడట.
విజయ్ సేతుపతి అలా చెప్పినప్పటి నుంచి పూరి అండ్ టీమ్ మరో టైటిల్ గురించి ఆలోచిస్తున్నారట. అయితే.. భవతీ భిక్షాందేహి అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చిందట. ఇది అచ్చ తెలుగు టైటిల్.. మరి.. తమిళ జనాలకు కూడా అర్థమౌతుందని ఈ టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారా..? లేక తమిళ్ లో కూడా ఇలాగే అంటారా ఏమో కానీ.. ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ టైటిల్ వార్తల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదేం టైటిల్ పూరి అని కొంత మంది అంటుంటే.. పూరి ఈసారి డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు అంటున్నారు మరి కొంత మంది.
ఇందులో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే కీలక పాత్ర పోషిస్తుందని వార్తలు వచ్చాయి కానీ.. అందులో వాస్తవం లేదని.. రాధిక ఆప్టే క్లారిటీ ఇచ్చింది. మలయాళ బ్యూటీ నివేథా థామస్ పేరు వినిపిస్తుంది కానీ.. నివేథా నటిస్తుందా..? లేదా..? అనేది క్లారిటీ లేదు. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో విలన్ గా నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని పై కూడా క్లారటీ రావాల్సింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. మరి.. టైటిల్ అండ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.