విజయ్ చివరి మూవీ బాలయ్య సినిమా రీమేకా?

Vijay Thalapathy’s Jana Nayagan: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ 130 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే.. ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారని.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్.. భగవంత్ కేసరి రీమేక్ అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీని గురించి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో భగవంత్ కేసరి వెర్సెస్ జన నాయకుడు అంటూ రచ్చ జరుగుతోంది. అసలు ఏమైంది..?

కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న ఆఖరి సినిమా జన నాయగన్. దీనిని తెలుగులో జన నాయకుడు అనే టైటిల్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి హెచ్ వినోద్ డైరెక్టర్. అయితే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రీమేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఇది నిజమా..? లేక గాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది. భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఇదే విషయం గురించి అడిగితే.. భగవంత్ కేసరి రీమేక్ ను డైరెక్టర్ చేయమని అడిగారు కానీ.. మళ్లీ అదే కథను డైరెక్ట్ చేయాలి అనుకోవడం లేదు.. అందుకనే నో చెప్పానన్నారు అనిల్ రావిపూడి.

ఇదిలా ఉంటే.. ఈ జన నాయకుడు సినిమా నుంచి ఫస్ట్ రోర్ రిలీజ్ చేశారు. విజయ్ ను పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో చూపిస్తూ అనిరుథ్ పవర్ ఫుల్ బీజీఎమ్ అందించాడు.ఇది రిలీజ్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. జన నాయకుడు గ్లింప్స్ కంటే.. బాలయ్య భగవంత్ కేసరి గ్లింప్సే బాగుంటుంది అంటూ బాలయ్య ఆరాను, విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడు అంటూ యాంటీ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే అనిరుథ్ బీజీఎం బాలేదని.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బీజీఎం వేరే లెవల్లో ఉందని కామెంట్లు పెడుతున్నారు.

దీంతో మరోసారి భగవంత్ కేసరి, జన నాయకుడు గురించి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. విజయ్ ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. దీంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. విజయ్ ఆఖరి సినిమాకి భగవంత్ కేసరి కథను రీమేక్ చేయడం కోసం ఎంచుకోవడం విశేషం. అయితే.. ఈ కథను పూర్తిగా తీసుకోకుండా.. మార్పులు చేర్పులుతో రీమేక్ చేస్తున్నారని తెలిసింది. జనవరి 9న జన నాయకుడు భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాడు. మరి.. విజయ్ ఆఖరి సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి. Vijay Thalapathy’s Jana Nayagan.

Also Read: https://www.mega9tv.com/cinema/exclusive-news-nagarjuna-and-anil-ravapudi-combo-has-been-fixed/