స్టార్ హీరోల వాట్సాప్ గ్రూప్ సీక్రెట్ బయటపెట్టిన మంచు విష్ణు..!

The secret of star heroes’ WhatsApp group: టాలీవుడ్ స్టార్ హీరోల వాట్సాప్ గ్రూపు ఒకటి ఉందట. ఈ విషయాన్ని మంచు విష్ణు నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలకు వాట్సాప్ గ్రూపు ఉందని.. అయితే.. ఆ గ్రూపు నుంచి తను బయటకు వచ్చేసానని చెప్పాడు. ఎందుకు స్టార్ హీరోల వాట్సాప్ గ్రూపు నుంచి విష్ణు బయటకు వచ్చేసాడు..? ఆ గ్రూపులో ఎవరెవరు ఉన్నారు..? అసలు ఏం జరిగింది..?

దగ్గుబాటి రానా, అల్లు అర్జున్.. ఈ ఇద్దరూ కలిసి వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారట. ఈ గ్రూపులో రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ఇలా ఓ 140 మందికి పైగా నటీనటులు ఉన్నారట. అయితే.. ఈ గ్రూపులో చాలా మంది హీరోయిన్లు కూడా ఉన్నారట. దీంతో విష్ణుకు అందరితో చాట్ చేయడం అంటే కొంత సిగ్గుగాను… మొహమాటంగా అనిపించేదట. అందుకే ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చేసానని చెప్పాడు. అయితే.. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే.. తనకి వ్యక్తిగతంగా మెసెజ్ చేయమని బన్నీ, రానాకు చెప్పానని విష్ణు తెలియచేశాడు.

ఇక తన తోటి నటీనటులుతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ.. రానా, బన్నీ, చరణ్‌, ఎన్టీఆర్ లతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని.. మా మధ్య చాలా మంది అనుబంధం ఉందని విష్ణు తెలియచేశాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం ఉన్నా.. ఒక్క ఫోన్ కాల్ తో ఒకరికొకరడం అండగా నిలబడతామని.. మా మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పాడు. మా పేరెంట్స్ నేర్పిన గొప్ప విషయాల్లో ఒకటి. ఈ సంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని విష్ణు తెలియచేశాడు. వాట్సాప్ గ్రూపు గురించి.. బన్నీ, చరణ్‌, ఎన్టీఆర్, రానాలతో ఉన్న అనుబంధం గురించి విష్ణు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. The secret of star heroes’ WhatsApp group.

ఇక కన్నప్ప విషయానికి వస్తే.. 10 సంవత్సరాలకు పైగా కన్నప్ప కథ పై కసరత్తు చేశారు. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాని నిర్మించారు. ముఖేష్‌ కుమార్ సింగ్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించడంతో కన్నప్ప పై మరింత క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రభాస్ అర గంట సేపు కనిపిస్తాడని విష్ణు చెప్పడంతో ఈ సినిమా ఎంత వరకు మెప్పిస్తుంది.. ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 21న భారీగా నిర్వహించే ఈ ఈవెంట్ కు ఇందులో నటించిన నటీనటులు అందరూ హాజరవుతున్నారని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.మరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/ssmb-29-set-a-new-record-with-movie-sets-over-50cr-budget/