
Vishwak Sen And Balayya: నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న క్రేజీ సీక్వెల్ అఖండ 2. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా విశ్వక్ సినిమాలో బాలయ్య నటిస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య సినిమాలో విశ్వక్.. విశ్వక్ సినిమాలో బాలయ్య.. ఇంతకీ ఇదంతా నిజమేనా..?
విశ్వక్ సేన్ కు బాలయ్య, ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. అందుకనే.. విశ్వక్ సేన్ సినిమాల ప్రమోషన్స్ కు బాలయ్య,, ఎన్టీఆర్ వస్తుంటారు. అయితే.. ఆమధ్య బాలయ్య సినిమాలో విశ్వక్ సేన్ నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ సినిమా అఖండ 2 అని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. దీంతో అఖండ 2 లో విశ్వక్ ఎలా కనిపించనున్నాడు..? క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. బాలయ్య అఖండ సినిమాలో అఘోర పాత్రలో కనిపించారు. విశ్వక్ గామి సినిమాలో అఘోరగా నటించారు. దీంతో అఖండ 2 లో విశ్వక్ అఘోరాగా కనిపిస్తాడా..? లేక వేరే క్యారెక్టర్ లో కనిపిస్తాడా అనేది తెలియాల్సివుంది. Vishwak Sen And Balayya.
ఇదిలా ఉంటే.. బాలయ్య సినిమాలో విశ్వక్ నటిస్తుంటే.. విశ్వక్ సినిమాలో బాలయ్య నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. తరుణ్ భాస్కర్.. విశ్వక్ సేన్ తో తెరకెక్కించిన సినిమా ఈ నగరానికి ఏమైంది. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సీక్వెల్ గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పార్ట్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. ఈ మూవీకి ఈఎన్ఈ రిపీట్ అనే టైటిల్ పెట్టారు. ఈఎన్ఈ అంటే ఈ నగరానికి ఏమైంది అని అర్థం.
ఈ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ త్వరలోనే టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. స్వయంగా బాలకృష్ణ అడిగి మరీ ఈ సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధం అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య కోసం తరుణ్ భాస్కర్ ఓ మంచి పాత్రను డిజైన్ చేస్తున్నట్టుగా టాక్. ప్రచారంలో ఉన్నది నిజమైతే.. ఇందులో బాలయ్య నటిస్తే ఈ సీక్వెల్ కు మరింత క్రేజ్ పెరగడం ఖాయం.