
విశ్వక్ సేన్.. తన సినిమాలతో కన్నా.. తన మాటలతో ఎక్కువుగా వార్తల్లో ఉంటుంటాడు. అదే.. విశ్వక్ సేన్ స్పెషాల్టీ. ఈమధ్య కాలంలో సక్సెస్ కి దూరంగా.. ఫెయిల్యూర్ కి దగ్గరగా ఉంటున్నాడు. ఈసారి గట్టిగా కొట్టాలనే ఉద్దేశ్యంతో డైరెక్టర్ అనుదీప్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ఫంకీ. టైటిల్ సౌండింగ్ కొత్తగా ఉంది. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. మరి.. ఈ ఫంకీ.. మరో జాతిరత్నాలు అవుతుందా..? విశ్వక్ కి విజయాన్ని అందిస్తుందా…?
ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. ఆతర్వాత అశోకవనంలో అర్జునకళ్యాణం, ఓరి దేవుడా, పాగల్, థమ్కి ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించాడు. ఈమధ్య కాలంలో కృష్ణ చైతన్య డైరెక్షన్ లో గ్యాంగ్స్ ఆప్ గోదావరి అనే సినిమా చేశాడు. చాలా ఆశలు పెట్టుకుంటే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆతర్వాత చేసిన మెకానిక్ రాఖీ, లైలా చిత్రాలు కూడా నిరాశపరిచాయి. లైలా సినిమాలో అయితే.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండడంతో విశ్వక్ పై విమర్శలు కూడా వచ్చాయి. ఆఖరికి ఇక నుంచి ఇలాంటి సినిమాలు చేయనని.. అందరకీ నచ్చే సినిమాలు చేస్తానని కూడా ఓ లేఖ రిలీజ్ చేశాడు.
ఇప్పుడు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ఫంకీ అనే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇదే బ్యానర్ లో విశ్వక్ తో నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెప్పించలేకపోయినా ఫంకీ మూవీ నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా అందర్నీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందట. ఈ సినిమాకి ఫంకీ అనే టైటిల్ పెట్టడం ఆసక్తిగా మారింది. ఇందులో లవ్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ ఇలా ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయట. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇంతకీ ఈ సినిమా అప్ డేట్ ఏంటంటే.. యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ను అపిషియల్ ఇవ్వనున్నారని తెలిసింది. పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ జాతారత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత ప్రిన్స్ అనే మూవీని శివ కార్తికేయన్ తో తెరకెక్కించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. నెక్ట్స్ మూవీ కోసం స్టార్ హీరోలకు కథలు చెప్పాడు కానీ.. సెట్ కాలేదు. విశ్వక్ తో ఈ మూవీ సెట్ కావడంతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు. ఇప్పుడు విశ్వక్, అనుదీప్.. ఇద్దరికీ సక్సెస్ చాలా అవసరం. మరి.. ఫంకీ మరో జాతిరత్నాలు అవుతుందా..? ఇద్దరికీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.