
ఓ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత చిరుతో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం వలన విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలి అనుకున్నాడు. అదీ సెట్ కాలేదు. ఆతర్వాత మాస్ మహారారాజా రవితేజతో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా ప్లానింగ్ జరుగుతుందని టాక్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా కుదరలేదని.. ఓ యంగ్ హీరోతో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు..? ఈసారైనా ప్రాజెక్ట్ సెట్ అయ్యేనా..?
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనుకున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్. ఆది సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన వినాయక్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందంచాడు. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. చిరుతో మూడో సినిమా చేయాలని కథ పై కసరత్తు చేశారు కానీ.. సెట్ కాలేదు. దీంతో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలి అనుకున్నాడు. వెంకీతో వినాయక్ ఆల్రెడీ లక్ష్మీ అనే సినిమా చేయడం.. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. ఆతర్వాత వెంకీతో వినాయక్ మరో మూవీ చేయలేదు.
వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో.. యాక్షన్ మూవీస్ కాకుండా.. ఫ్యామిలీ మూవీస్ చేయడం పైనే ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. వెంకీతో కూడా ప్రాజెక్ట్ ఫిక్స్ కాకపోవడంతో మాస్ మహారాజా రవితేజతో వినాయక్ మూవీ చేయాలి అనుకున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి కృష్ణ అనే సినిమా చేశారు. ఆ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఈ కాంబో పిక్స్ అంటూ టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి కానీ.. అపిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.
వినాయక్ గత కొన్ని రోజులుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడంతో పూర్తిగా సినిమాల పై కన్ సన్ ట్రేషన్ చేయబోతున్నారు. ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రెడీ చేశాడట. ఈ కథకు సిద్దు జొన్నలగడ్డ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో కాంటాక్ట్ చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వినాయక్ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే.. ఈ మధ్య సక్సెస్ లేకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం ఆలస్యం అవుతోంది. కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఇక నుంచి వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నారట. మరి.. సిద్దుతో వినాయక్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందా..? ఇక నుంచైనా గ్యాప్ లేకుండా వినాయక్ సినిమాలు చేస్తారేమో చూడాలి.