రజినీతో పోటీకి సై అంటున్న ఎన్టీఆర్..!!

ఈ ఇయర్ లో రానున్న రెండు భారీ, క్రేజీ మల్టీస్టారర్స్ అంటే.. ఒకటి రజినీకాంత్ కూలీ, రెండోది ఎన్టీఆర్ వార్ 2. ఈ రెండు క్రేజీ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తాయా అని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. వార్ 2 ఆగష్టు 14న రానుందని ఎప్పుడో ప్రకటించారు. ఆతర్వాత కూలీ మూవీ ఆగష్టు 14న వస్తుందని అనౌన్స్ చేశారు. దీంతో వార్ 2 పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు వార్ 2 టీజర్ రిలీజ్ చేయడంతో పాటు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ.. వార్ 2 టీజర్ ఎలా ఉంది..? ఈ క్రేజీ సినిమాల మధ్య పోటీ తప్పదా..?

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ నువ్వా..? నేనా..? అనేట్టుగా పోటీపడి నటించినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి పాత్రలను బాగా డిజైన్ చేశారు. ఆడియన్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా థ్రిల్ కలిగించడం ఖాయం అనే ఫీలింగ్ ను ఈ గ్లింప్స్ కలిగించింది. అయితే.. ఈ సినిమా ఆగష్టు 14న విడుదల కానున్నట్టుగా కన్ ఫర్మ్ చేశారు. దీంతో రజినీ కూలీ వెర్సెస్ ఎన్టీఆర్ వార్ 2 అనేది హాట్ టాపిక్ అయ్యింది. నిజంగా ఈ రెండు సినిమాలు ఓకే రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడింతే మామూలుగా ఉండదు.

ఈ రెండు సినిమాల్లో ఏదోక సినిమా పోస్ట్ పోన్ అవుతుందా..? లేక రెండు సినిమాలు తగ్గేదేలే అంటూ పోటీకి సై అంటాయా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు సినిమాలకు క్రేజీ్ మామూలుగా లేదు. అయితే.. ఒకే రోజు ఈ రెండు చిత్రాలు థియేటర్స్ లోకి వస్తే.. రెండు సినిమాల కలెక్షన్స్ పై ప్రభావడం పడడం ఖాయం. అందుచేత ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకోవడం.. రిలీజ్ డేట్ మార్చుకుంటే మంచిది అనేది ట్రేడ్ పండితుల మాట. ఇప్పటి వరకు మాత్రం ఎవరూ తగ్గడం లేదు.. ఆగష్టు 14న రావడం ఖాయం అంటున్నారు. మరి.. ఆగష్టు 14న ఏం జరగనుందో.. ఎవరు వస్తారో.. ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారో చూడాలి.